రూ.72 లక్షల బీమా డబ్బు కోసం కుటుంబంతో కలిసి భారీ స్కెచ్.. చివరికి ఊహించని ట్విస్ట్

|

Mar 16, 2023 | 12:37 PM

వ్యాపారంలో నష్టాలు రావడం సహజమే. అప్పుల చేసి మరి వ్యాపారాన్ని నడిపేందుకు వ్యాపారులు ఎన్నో తంటాలు పడుతుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఏకంగా తన కుటుంబంతో సహా చనిపోయినట్లు నటించి బీమా డబ్బులు పొందాలని చూశాడు.

రూ.72 లక్షల బీమా డబ్బు కోసం కుటుంబంతో కలిసి భారీ స్కెచ్.. చివరికి ఊహించని ట్విస్ట్
Money
Follow us on

వ్యాపారంలో నష్టాలు రావడం సహజమే. అప్పుల చేసి మరి వ్యాపారాన్ని నడిపేందుకు వ్యాపారులు ఎన్నో తంటాలు పడుతుంటారు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు. ఏకంగా తన కుటుంబంతో సహా చనిపోయినట్లు నటించి బీమా డబ్బులు పొందాలని చూశాడు. చత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాకు చెందిన సమీరన్ అనే వ్యక్తి తన వ్యాపారంలో నష్టపోయాడు. దీంతో చాలావరకు అప్పులు చేశాడు. బ్యాంకుల నుంచి లోన్లు కూడా తెచ్చుకున్నాడు. అయినా అతను ఆ పరిస్థితుల నుంచి బయటపడలేకపోయాడు. దీంతో ఎలాగైన అప్పులు తీర్చి ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలని ఓ పథకం వేశాడు. బీమా డబ్బు కోసం తన కుటుంబంతో సహా మృతి చెందినట్లు నాటకమాడాడు. దాదాపు రూ.72 లక్షల బీమా సొమ్ము కోసం ప్రమాదవశాత్తు కుటుబంతో సహా కాలి బుడదైనట్లు ఆధారాలు తయారు చేశాడు.

మార్చి 1న తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి కాంకేర్ నుంచి కారులో బయలుదేరి ధామ్ తరి చేరుకున్నాడు. అక్కడ ఓ లాడ్జిలో తన కుటుంబాన్ని ఉంచాడు. ఆ తర్వాత అదే కారులో కాంకేర్‌లోని చావాడీ గ్రామ సమీపానికి వెళ్లాడు. అక్కడ తన కారును ఓ చెట్టుకు ఢీకొట్టి.. దానికి నిప్పంటించాడు. ఈ ప్రమాదంలో తనతో పాటు కుటుంబసభ్యులు చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ఇందుకోసం దాదాపు వెయ్యికి పైగా సీసీటీవీ దృశ్యాలు, 45 వేల ఫోన్‌ నంబర్లను పరిశీలించారు. వీటి ఆధారంగా చివరికీ వారంతా బతికి ఉన్నట్లు తేల్చారు. తన కుటుంబం బతికే ఉందని పోలీసులు గుర్తించారన్న విషయాన్ని సమీరన్‌ తెలుసుకున్నాడు. దీంతో మార్చి 13న కాంకేర్‌లోని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు సమీరన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..