వీడు రాసప్పన్ కాదు ‘రాక్షసన్’.. అందుకోసం రెండేళ్ల పాపను నరబలి ఇచ్చేందుకు యత్నం.. క్లైమాక్స్‌లో ట్విస్ట్
నరబలితో ఆత్మలు శాంతిస్తాయా? చనిపోయిన తన భార్య, కూతురు కోసం మరో పసిపాప ప్రాణం తీయాలని ప్లాన్ చేశాడో దుర్మార్గుడు. కన్యాకుమారి సమీపంలో రెండేళ్ల పసిపాపను నరబలి ఇచ్చేందుకు నిందితుడు ఏర్పాట్లు చేసుకున్నాడు.
నరబలితో ఆత్మలు శాంతిస్తాయా? చనిపోయిన తన భార్య, కూతురు కోసం మరో పసిపాప ప్రాణం తీయాలని ప్లాన్ చేశాడో దుర్మార్గుడు. తమిళనాడులోని కన్యాకుమారి సమీపంలో రెండేళ్ల పసిపాపను నరబలి ఇచ్చేందుకు నిందితుడు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంటి ముందు ఆడుకుంటూ ఉన్న రెండేళ్ల కూతురు కనిపించకుండా పోయిందని చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేసినా పాప ప్రాణాలు పోయేవి. రెండేళ్ల చిన్నారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తొలుత ఇంటిపక్కనే ఉన్న బావిలో వెదికారు. ఆడుకుంటూ అందులో పడిపోయి ఉంటుందని భావించారు. తర్వాత చుట్టుపక్కల ప్రాంతాలు, అనుమానాస్పద వ్యక్తులను విచారించారు. రెండు కిలోమీటర్ల దూరంలో ఓ అరటితోటలో వింత శబ్దాలు రావడాన్ని గుర్తించారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే.. నరబలి ఏర్పాట్లు కనిపించాయి. చనిపోయిన తన భార్య, కూతురు ఆత్మలు శాంతించేందుకు రెండేళ్ల పసిపాపను బలి ఇవ్వబోతున్నట్టు నిజం ఒప్పుకున్నాడు నిందితుడు రాసప్పన్. అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం చిన్నారిని తల్లితండ్రులకు అప్పగించారు తమిళనాడు పోలీసులు
కాగా క్లైమాక్స్‌లో వచ్చే రీల్ పోలీసులకు.. రియల్ కాప్స్‌కు చాలా తేడా ఉంటుందని నిరూపించారు తమిళనాడు పోలీసులు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. అదే సమయంలో చిన్నారిని కాపాడిన పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..