Odisha Train Accident: తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకు.. తిరిగి వెళ్తూ అంతలోనే

|

Jun 03, 2023 | 5:31 PM

ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ ప్రజల్ని కలచివేస్తోంది. తాజా సమాచారం మేరకు మృతుల సంఖ్య 278కి చేరడం.. వెయ్యిమందికి పైగా క్షతగాత్రులు కావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం సహయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో హృదయ విదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లి చనిపోవడంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకు..అంత్యక్రియల తదనంతరం తిరిగి వెళ్తూ ఈ రైలు ప్రమాదంలో మరణించడం కంటతడి పెట్టిస్తోంది.

Odisha Train Accident: తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకు.. తిరిగి వెళ్తూ అంతలోనే
Odisha Train Accident
Follow us on

ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం దేశ ప్రజల్ని కలచివేస్తోంది. తాజా సమాచారం మేరకు మృతుల సంఖ్య 278కి చేరడం.. వెయ్యిమందికి పైగా క్షతగాత్రులు కావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం సహయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో హృదయ విదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తల్లి చనిపోవడంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకు..అంత్యక్రియల తదనంతరం తిరిగి వెళ్తూ ఈ రైలు ప్రమాదంలో మరణించడం కంటతడి పెట్టిస్తోంది. వివరాల్లోకి వెళ్తే రమేష్ అనే వ్యక్తి చెన్నైలో స్థిరపడి అక్కడే పనిచేస్తూ జీవిస్తున్నాడు. అయితే ఇటీవలే తన తల్లి మరణంతో 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చాడు. అంత్యక్రియలు, పెద్దకర్మ లాంటి కార్యక్రమాలు పూర్తయ్యాక అతను మళ్లీ చెన్నై వెళ్లేందుకు బయలుదేరాడు.

శుక్రవారం సాయంత్రం 6.30 గంటలకు రమేష్ ఒడిషాలోని బలాసూర్ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కాడు. బద్రక్ స్టేషన్‌కు చేరుకుని కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాక ఫోన్ చేస్తానని తన సోదరులకు చెప్పాడు. ఇక కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న అతని ఇద్దరు సోదరులు ఘటనాస్థలానికి హుటాహుటీనా చేరుకున్నారు. తమ సోదరుడి ఫోన్ చేయగా ఎటువంటి సమాధానం రాలేదు. అతని కోసం వెతికినప్పటికీ కనిపించలేదు. చివరకి మళ్లీ ఓసారి ఫోన్ చేయడంతో ఓ గుర్తు తెలియని లిఫ్ట్ చేసి రమేష్ చనిపోయాడంటూ వాళ్లకు చెప్పాడు. దీంతో ఆ సోదరులు రమేష్ మృతదేహం కోసం రైలు బోగీలు, పలు ఆస్పత్రుల్లో గాలించిన ఆచూకి దొరకలేదు. చివరికి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తమ సోదరుడి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. 14 ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిన కొడుకు తిరిగి వెళ్తూ ఈ ప్రమాదంలో మృతిచెందడంతో వారి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి