Durga Idol Immersion: దుర్గమ్మ విగ్రహ నిమజ్జనంలో విషాదం.. బెంగాల్‌లో 8 మంది, రాజస్థాన్‌లో 6 మంది మృతి.. ప్రధాని సంతాపం

|

Oct 06, 2022 | 8:03 AM

నవరాత్రి ఉత్సవాలకు భక్తిశ్రద్దలతో పూజించిన అమ్మవారి విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చడానికి అనేక మంది ప్రజలు మాల్‌ నది వద్దకు వెళ్లారు. నది మధ్యలో ఉన్న ఓ చిన్న దీవి లాంటి ప్రదేశంలో నిల్చుని.. విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు.

Durga Idol Immersion: దుర్గమ్మ విగ్రహ నిమజ్జనంలో విషాదం.. బెంగాల్‌లో 8 మంది, రాజస్థాన్‌లో 6 మంది మృతి.. ప్రధాని సంతాపం
Durga Idol Immersion
Follow us on

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున రెండు రాష్ట్రాల్లో విషాదం నెలకొంది. దుర్గమ్మ విగ్రహం నిమజ్జనానికి వెళ్లి బుధవారం రెండు రాష్ట్రాల్లో మొత్తం 14 మంది చనిపోయారు. విగ్రహాల నిమజ్జనం సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో 8 మంది, రాజస్థాన్‌లో 6 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గల్లంతు అయ్యారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురి జిల్లా మాల్ నవరాత్రి ఉత్సవాలకు భక్తిశ్రద్దలతో పూజించిన అమ్మవారి విగ్రహాన్ని గంగమ్మ ఒడికి చేర్చడానికి అనేక మంది ప్రజలు మాల్‌ నది వద్దకు వెళ్లారు. నది మధ్యలో ఉన్న ఓ చిన్న దీవి లాంటి ప్రదేశంలో నిల్చుని.. విగ్రహాలు నిమజ్జనం చేస్తున్నారు. అకస్మాత్తుగా నీటి మట్టం పెరిగి వరద పోటెత్తింది. దీంతో బలమైన అలల్లో చిక్కుకుని అనేక మంది కొట్టుకుపోయారు. 8మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. వరద ఉద్ధృతి మధ్య దీవిపై ప్రాణాలను కాపాడుకోవడం నిల్చున్న దాదాపు 50 మందిని రక్షించారు.. జల్పాయిగురి ఎస్పీ దేవర్షి దత్తా మాట్లాడుతూ.. ప్రవాహ ఉధృతికి చాలా మంది కొట్టుకుపోయారని..నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.  రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

అదే సమయంలో, రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా నసీరాబాద్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం దుర్గామాత విగ్రహం నిమజ్జనం సందర్భంగా వర్షపు నీటితో నిండిన కాలువలో మునిగి ఆరుగురు మరణించారు. ఇదే విషయంపై అజ్మీర్ పోలీసు సూపరింటెండెంట్ చునారామ్ జాట్ మాట్లాడుతూ, స్థానిక ప్రజలు దసరా నవరాత్రులు ముగింపు సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేస్తూనే ఉంటారు. లోతైన నీటిలోకి వెళ్లి యువకులు మరణించారని తొలుత ఐదు మృతదేహాలను వెలికి తీశామని, ఆ తర్వాత మరో వ్యక్తి గల్లంతైనట్లు గుర్తించామని తెలిపారు. ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించామని, సాయంత్రానికి మరో మృతదేహాన్ని వెలికి తీశామని చెప్పారు..అతను అజ్మీర్‌లో మరణించిన మృతులను పవన్ రాయగర్ (35), గజేంద్ర రాయగర్ (28), రాహుల్ మేఘవాల్ (24), లక్కీ బైర్వా (21) ,రాహుల్ రాయ్‌గర్ (20), శంకర్‌గా గుర్తించారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. అజ్మీర్‌లోని నసీరాబాద్ ప్రాంతంలోని నంద్లా గ్రామంలో విగ్రహ నిమజ్జనం సందర్భంగా నీటిలో మునిగి ఆరుగురు మృతి చెందడం చాలా బాధాకరమని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను, ఈ కష్టాన్ని భరించే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నట్లు చెప్పారు.

ప్రధాని సంతాపం తెలిపారు
అదే సమయంలో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా విచారం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలో దుర్గాపూజ పండుగ సందర్భంగా జరిగిన ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..