ఆడుకుంటూ వెళ్లి రైలు పట్టాలపై కనిపించిన బాక్స్ తెరిచిన బాలుడు.. ఆపై షాకింగ్ ఘటన

రైలు లక్ష్యంగా ఆ బాంబు పెట్టారా..? అక్కడే మరో బాంబు కూడా దొరకడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. వెంటనే ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని పూర్తి తనిఖీలు చేశారు.

ఆడుకుంటూ వెళ్లి రైలు పట్టాలపై కనిపించిన బాక్స్ తెరిచిన బాలుడు.. ఆపై షాకింగ్ ఘటన
Bomb Disposal Team

Updated on: Oct 25, 2022 | 6:29 PM

బెంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. బాంబు పేలి 7 ఏళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ట్రైన్‌ను టార్గెట్‌ చేసి.. బాంబ్ పెట్టినట్లు అధికారులు గుర్తించారు. బాలుడు తన మిత్రులతో ఆడకుంటూ.. ఆ బాక్స్‌ తెరవగా.. బాంబు పేలిందని వెల్లడించారు. ఘటనాస్థలంలో తనిఖీలు చేయగా.. అదే ప్రాంతంలో మరో బాంబ్ దొరికిందని అధికారులు తెలిపారు. కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న  కాకినార-జగద్దల్​ స్టేషన్ల మధ్య మార్నింగ్ 7:30 నుంచి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఘటనలో గాయపడ్డ మరో ఇద్దరు పిల్లల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విభిన్న కోణాల్లో విచారిస్తున్నారు.

ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. “రైల్వే ట్రాక్‌పై దుండగులు ఈ బాంబును ఉంచారు. పిల్లలు ఆడుకునే క్రమంలో దాన్ని ఓపెన్ చేశారు. ముగ్గురు బాలురులో ఒకరు ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. గాయపడిన చిన్నారులకు చికిత్స అందిస్తున్నాం” అని తెలిపారు.

“మా మనవడు ఉదయం నిద్రలేచి రైలు పట్టాల వెంబడి ఆడుకోవడానికి వెళ్ళాడు. గత రాత్రి కాళీపూజ కావడంతో అతడితో పాటు మిత్రులు  కాల్చని పటాకులు ఏమైనా దొరికుతాయని తెచ్చుకోవడానికి వెళ్లారు. అక్కడ బాంబు పేలుడులో అతని చేయి విరిగిపోయింది” అని గాయపడిన చిన్నారి అమ్మమ్మ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి