ట్రాక్టర్‌ టైర్ల కిందపడి 7ఏళ్ల బాలుడు మృతి.. రోడ్డుపై బైఠాయించి స్థానికుల ఆందోళన

యూపీలోని చందౌలీ జిల్లాలో సైకిల్‌పై వెళ్తున్న లక్కీ మౌర్య అనే బాలుడిని ట్రాక్టర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించాడు. ఈ విషాద ఘటనతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించి, బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.

ట్రాక్టర్‌ టైర్ల కిందపడి 7ఏళ్ల బాలుడు మృతి.. రోడ్డుపై బైఠాయించి స్థానికుల ఆందోళన
Road Accident

Updated on: Dec 14, 2025 | 5:57 PM

ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో ఆదివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సైకిల్‌పై వెళ్తున్న లక్కీ మౌర్య అనే ఏడేళ్ల బాలుడిని భారీ వేగంతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం 7 గంటల ప్రాంతంలో బాబూరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటన జరిగింది. ఈ ఘోర ప్రమాదంతో ఆగ్రహించిన స్థానికులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, గ్రామస్తులకు నచ్చజెప్పి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. పోలీసులు బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. వాహనం టైరు పగిలిపోవడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని పోలీసులు తెలిపారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

దబ్రా కాలా గ్రామానికి చెందిన రితేష్ గిరి తన ఇంటి బయట ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. గోధుమలతో నిండిన ట్రాక్టర్ ప్రయాణిస్తున్నప్పుడు అకస్మాత్తుగా టైర్ పేలిపోయింది.. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బాలుడిని ఢీకొట్టడంతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడని, ఆసుపత్రికి తరలిస్తుండగా బాలుడు మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, వివరణాత్మక దర్యాప్తు జరుపుతున్నట్లు బాబూరి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ సూర్య ప్రకాష్ శుక్లా తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..