Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన మృతదేహాలు ఇంకా మార్చురీలోనే

ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాదం దేశవ్యా్ప్తంగా కలిచి వేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగి దాదాపు నెలరోజులు పూర్తికావస్తున్న ఇప్పిటికీ కూడా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. వాస్తవానికి ఇంకా 52 మృతదేహాలు గుర్తించాల్సి ఉంది.

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన మృతదేహాలు ఇంకా మార్చురీలోనే
Odisha Train Tragedy

Updated on: Jul 01, 2023 | 5:26 AM

ఇటీవల జరిగిన ఒడిశా రైలు ప్రమాదం దేశవ్యా్ప్తంగా కలిచి వేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటన జరిగి దాదాపు నెలరోజులు పూర్తికావస్తున్న ఇప్పిటికీ కూడా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. వాస్తవానికి ఇంకా 52 మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. ఈ విషయాన్ని భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సులోచనా దాస్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ మృతదేహాలు భువనేశ్వర్ ఎయిమ్స్ ఆసుపత్రిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఈ రైలు ప్రమాద ఘటనలో మరణించినవారిలో 81 మృతదేహాలు భువనేశ్వర్ ఎయిల్స్‌లో ఉన్నాయని.. వాటి నమునాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షలకు పంపించామని తెలిపారు.

ఇందులో 29 మృతులను గుర్తించిన అనంతంరం వారి కుటుంబీకులు సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఇంకా 52 మృతదేహాలు ఉన్నాయన్నారు. ఒడిశా ప్రభుత్వం ఆదేశాల మేరకు వాటిని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఒకవేళ కుటుంబీకులు ఎవరూ రాకపోతే భువనేశ్వర్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఇప్పటికే బీఎంసీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా జూన్ 2వ తేదిన బాలాసోర్ వద్ద మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 291 మంది ప్రాణాలు కోల్పోగా వెయ్యిమందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం