Leopard Skin Smuggling: చిరుతపులి చర్మం స్మగ్లింగ్‌కు యత్నం.. ఐదుగురిని అరెస్ట్ చేసిన అటవీ అధికారులు

ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామ సమీపంలో చిరుతపులి చర్మాన్ని మంగళవారం (డిసెంబర్ 5) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని విక్రయించేందుకు ప్రయత్నించిన ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. చిరుతపులి చర్మాన్ని స్మగ్లింగ్‌పై పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఈ మేరకు దాడులు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలోని ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్‌కు చెందిన యాంటీ-పోచింగ్ టీమ్, ఒడిశా అటవీ విభాగం సంయుక్తంగా సోమవారం రాత్రి ఒడిశాలోని కలహండి జిల్లాలో..

Leopard Skin Smuggling: చిరుతపులి చర్మం స్మగ్లింగ్‌కు యత్నం.. ఐదుగురిని అరెస్ట్ చేసిన అటవీ అధికారులు
Leopard Skin Smuggling

Updated on: Dec 06, 2023 | 6:04 PM

ఛత్తీస్‌గఢ్, డిసెంబర్ 6: ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని ఓ గ్రామ సమీపంలో చిరుతపులి చర్మాన్ని మంగళవారం (డిసెంబర్ 5) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దానిని విక్రయించేందుకు ప్రయత్నించిన ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు అటవీ అధికారులు తెలిపారు. చిరుతపులి చర్మాన్ని స్మగ్లింగ్‌పై పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఈ మేరకు దాడులు నిర్వహించారు. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాలోని ఉదంతి సీతానది టైగర్ రిజర్వ్‌కు చెందిన యాంటీ-పోచింగ్ టీమ్, ఒడిశా అటవీ విభాగం సంయుక్తంగా సోమవారం రాత్రి ఒడిశాలోని కలహండి జిల్లాలో ఆపరేషన్ నిర్వహించినట్లు USTR డిప్యూటీ డైరెక్టర్ వరుణ్ జైన్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో జిల్లాలోని అమపాని గ్రామ రహదారిపై ఐదుగురు వ్యక్తుల నుంచి 1.97 మీటర్ల చిరుత చర్మం, రెండు ద్విచక్రవాహనాలు, ఐదు మొబైల్ ఫోన్లు, పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు.

దాదాపు మూడేళ్ల చిరుతపులి వేటాడినట్లు అధికారులు తెలిపారు. అరెస్టు చేసిన ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుపై తదుపరి విచారణ ప్రారంభించారు. కాగా నవంబర్ 29న జరిపిన మరో దాడిలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఇద్దరు వ్యక్తుల నుంచి పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మరో ఘటన.. తెలంగాణ వర్షాలకు ఇల్లు కూలి దంపతుల మృతి

తెలంగాణలో కురుస్తోన్న వర్షాలకు తడిసిన ఇల్లు కుప్పకూలింది. ఈ ఘటనలో దంపతులు మృతిచెందారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారంలో మంగళవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నూకతోటి పుల్లారావు (40), నూకతోటి లక్ష్మి(30) కూలీలుగా జీవనం సాగించేవారు. మంగళవారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి వారి ఇంటి స్లాబు ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో భార్యాభర్తలిద్దరూ శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికులు చేరుకొని వారిని బయటకు తీసుకొచ్చారు. అనంతరం 108కు సమాచారం అందించారు. వాహన సిబ్బంది వచ్చి పరిశీలించగా అప్పటికే ఇద్దరూ మృతిచెందినట్లు నిర్ధారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.