Earthquake: జమ్మూ కాశ్మీర్ భూకంపం.. 5.8 తీవ్రతతో.. భయాందోళన చెందిన జనం

|

Nov 28, 2024 | 8:24 PM

ఈ భూకంపం కారణంగా, హిమాలయ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో 04:19 సమయంలో తేలికపాటి ప్రకంపనలు సంభవించాయని తెలిసింది.. గత 24 గంటల్లో ఈ ప్రాంతంలో భూకంపం రావడం ఇది రెండోసారి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Earthquake: జమ్మూ కాశ్మీర్ భూకంపం.. 5.8 తీవ్రతతో.. భయాందోళన చెందిన జనం
Earthquake
Follow us on

Jammu Kashmir Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించినట్టుగా వార్తలు వెలుగులోకి వచ్చాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంగా గుర్తించార. నేషనల్ సిస్మోలజీ సెంటర్ ప్రకారం.. ఆఫ్ఘనిస్తాన్‌లో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని సమాచారం. ఈ భూకంపం కారణంగా, హిమాలయ ప్రాంతంలోని వివిధ ప్రాంతాల్లో 04:19 సమయంలో తేలికపాటి ప్రకంపనలు సంభవించాయని తెలిసింది.. గత 24 గంటల్లో ఈ ప్రాంతంలో భూకంపం రావడం ఇది రెండోసారి. అయితే ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.

సమాచారం ప్రకారం, భూకంపం కేంద్రం 209 కిలోమీటర్ల లోతులో ఉంది. దీని కోఆర్డినేట్లు 71.32 డిగ్రీల తూర్పు రేఖాంశం, 36.62 డిగ్రీల ఉత్తర అక్షాంశం. దీని ప్రభావంతో జమ్మూకశ్మీర్‌లో కూడా భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా అలర్ట్ ప్రకటించారు.

నవంబర్ 26న జపాన్‌లో భూకంపం సంభవించింది. జపాన్ వాతావరణ సంస్థ ప్రకారం, నవంబర్ 26, 2024 న, జపాన్ ఉత్తర-మధ్య ప్రాంతంలోని నోటో ద్వీపకల్పంలో రాత్రి 10.47 గంటలకు 10 కి.మీ లోతులో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, సునామీ ముప్పు లేదు. ఎలాంటి నష్టం జరిగినట్లు వార్తలు రాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..