చిన్నారిని కాటేసిన పాము..ఆస్పత్రికి కాకుండా తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లిన బామ్మ.. చివరికి

|

May 05, 2023 | 3:26 PM

రోజురోజుకు సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికీ మూఢనమ్మకాలను మాత్రం కొందరు ఇంకా వదలడం లేదు. తన మనవడిని పాము కాటు వేయడంతో డాక్టర్ దగ్గరికి కాకుండా ఓ తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లింది. ఓ బామ్మ. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఓ కుటుంబం ఉంటోంది. ఆ తల్లిదండ్రులకు నాలుగేళ్ల వయసున్న సుర్జిత్ బౌల్ దాస్ అనే కొడుకు ఉన్నాడు.

చిన్నారిని కాటేసిన పాము..ఆస్పత్రికి కాకుండా తాంత్రికుడి వద్దకు తీసుకెళ్లిన బామ్మ.. చివరికి
Snake
Follow us on

రోజురోజుకు సాంకేతికత అభివృద్ధి చెందుతున్నప్పటికీ మూఢనమ్మకాలను మాత్రం కొందరు ఇంకా వదలడం లేదు. తన మనవడిని పాము కాటు వేయడంతో డాక్టర్ దగ్గరికి కాకుండా ఓ తాంత్రికుడి దగ్గరకు తీసుకెళ్లింది. ఓ బామ్మ. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఓ కుటుంబం ఉంటోంది. ఆ తల్లిదండ్రులకు నాలుగేళ్ల వయసున్న సుర్జిత్ బౌల్ దాస్ అనే కొడుకు ఉన్నాడు. అయితే ఆ తల్లిదండ్రులు ఆ బాబుని వాళ్ల బామ్మ దగ్గర వదిలి బయటకు వెళ్లారు. సుర్జిత్ తన స్నేహితులతో కలిసి ఇంటికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఆడుకుంటున్నాడు. ఇదే సమయంలో అక్కడ ఉన్న ఓ పాము పుట్టలో చేయి పెట్టాడు సుర్జిత్ .

ఆ పుట్టలో ఉన్న పాము ఆ బాబును కాటేసింది. దీంతో ఆ బాలుడు అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. అతని స్నేహితులు ఈ విషయాన్ని తన బామ్మకు చెప్పారు. కానీ ఆ బామ్మ వైద్యుడ్ని సంప్రదించకుండా ఆ బాబుని తీసుకొని ఊరిలో ఉన్న ఓ తాంత్రికుడ్ని వెతుక్కుంటూ వెళ్లింది. ఈ సమాచారం ఆ బాబు తల్లిదండ్రులకు తెలియడంతో హుటాహుటిన వచ్చి కొన ఊపిరితో ఉన్న బాబును ఆస్పత్రికి తరలించారు. కానీ ఆ బాబు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు పాముకాటుకు బలవ్వడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..