Accident: అంతా నిద్రలో ఉండగా ఇంట్లోకి దూసుకొచ్చిన మృత్యువు.. రిటైర్ట్ ఎస్‌ఐ సహా నలుగురు దుర్మరణం..

|

Aug 16, 2022 | 4:29 PM

ఢిల్లీ నుంచి వస్తుండగా ట్రక్కు అదుపు తప్పి పరుష్రామ్ సింగ్ ఇంటిపైకి దూసుకెళ్లిందని తెలిపారు. ఈ ఘటనలో రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ పరుష్రామ్ సింగ్,అతని భార్య మరణించారన్నారు. వారితోపాటు

Accident: అంతా నిద్రలో ఉండగా ఇంట్లోకి దూసుకొచ్చిన మృత్యువు.. రిటైర్ట్ ఎస్‌ఐ సహా నలుగురు దుర్మరణం..
Accident
Follow us on

Truck Accident: ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లోకి ట్రక్కు దూసుకెళ్లడంతో రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌తో సహా నలుగురు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. యూపీ కురవాలి పోలీస్ స్టేషన్ సమీపంలోని జిటి రోడ్‌లో ఖిరియా పీపాల్ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసు సూపరింటెండెంట్ కమలేష్ కుమార్ దీక్షిత్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి వస్తుండగా ట్రక్కు అదుపు తప్పి పరుష్రామ్ సింగ్ ఇంటిపైకి దూసుకెళ్లిందని తెలిపారు. ఈ ఘటనలో రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్‌ పరుష్రామ్ సింగ్,అతని భార్య మరణించారన్నారు. వారితోపాటు ట్రక్కు డ్రైవర్, క్లీనర్ కూడా మృతిచెందారని.. వాహనంలో ఉన్న మరో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించారు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటచేసుకున్నట్లు వెల్లడించారు. శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.

కాగా.. మరణించిన వారి కుటుంబాలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు, గాయపడిన వారికి తక్షణమే వైద్య చికిత్స అందించాలని మెయిన్‌పురిలో అధికారులను ఆదేశించారు. అంతకుముందు ఆగస్టు 8న, ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడి కారును ట్రక్కు ఢీకొట్టిన విషయం తెలిసిందే. ట్రక్కు కారుని ఢీకొని 500 మీటర్ల దూరం వరకూ ఈడ్చుకెళ్లింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..