AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన వన్యప్రాణుల వేటగాళ్ల ముఠా అరెస్ట్‌.. భారీగా చర్మం, దంతాలు స్వాధీనం

అధికారులు స్వాధీనం చేసుకున్న వన్యప్రాణి భాగాలు అత్యంత అరుదైనవి. అంతరించి పోతున్న జంతుజాతులకు చెందినవని తెలిసింది. ఈ వన్యప్రాణులను వేటాడడం, అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు ఎవరికైనా కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. అయితే.. నిందితులు ముగ్గురిపై CBI ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తోంది. అక్రమ వన్యప్రాణి వ్యాపారానికి సంబంధించి

అరుదైన వన్యప్రాణుల వేటగాళ్ల ముఠా అరెస్ట్‌.. భారీగా చర్మం, దంతాలు స్వాధీనం
Illegal wildlife trade operation
Noor Mohammed Shaik
| Edited By: Jyothi Gadda|

Updated on: Feb 04, 2025 | 11:59 AM

Share

వన్యప్రాణులను వేటాడి వాటి చర్మం, దంతాలను అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్న ముఠా అరెస్ట్ అయింది. సీబీఐ వన్యప్రాణి నేరాల విభాగం, వన్యప్రాణి నేర నియంత్రణ బ్యూరో అధికారులతో కలిసి ఫిబ్రవరి 3, 2025 తెల్లవారుజామున చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో వన్యప్రాణుల అక్రమ వేట, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో వన్యప్రాణులను వేటాడుతున్న నలుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి చిరుతపులి, ఇతర జంతువుల చర్మాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌ హర్యాణాలోని పింజోర్ ప్రాంతంలో జరిగింది. అనుమానితంగా ఉన్న ఒక వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.

– చిరుతపులి తోళ్లు – 2

– చిరుతపులి పళ్లు – 9

ఇవి కూడా చదవండి

– చిరుతపులి గోర్లు – 25

– చిరుతపులి దవడ భాగాలు – 3

– ఊదబిలవ తోళ్లు – 3

– ప్యాంగోలిన్ త్వచం

పక్కా సమాచారం మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్ సమయంలో పీరదాస్, వజీరా, రామ్ దయాళ్‌ అనే ముగ్గురిని అక్కడికక్కడే అరెస్ట్ చేశారు. మరో నిందితుడు రోహతాస్‌ను కాల్కా రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) 2023 సెక్షన్ 61(2), వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972 సెక్షన్లు 40, 49, 49B, 51 కింద కేసులు నమోదు చేశారు. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే.. అరెస్టయిన వారిలో ఒకరు ఇదివరకే నేపాల్ పోలీసులు వన్యప్రాణి నేరానికి సంబంధించి చార్జ్‌షీట్ చేసిన నిందితుడు కావడం గమనార్హం. కాగా, స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1972లోని షెడ్యూల్-Iలోకి వస్తాయి.

అధికారులు స్వాధీనం చేసుకున్న వన్యప్రాణి భాగాలు అత్యంత అరుదైనవి. అంతరించి పోతున్న జంతుజాతులకు చెందినవని తెలిసింది. ఈ వన్యప్రాణులను వేటాడడం, అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారు ఎవరికైనా కఠిన శిక్షలు విధించే అవకాశం ఉంటుంది. అయితే.. నిందితులు ముగ్గురిపై CBI ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తోంది. అక్రమ వన్యప్రాణి వ్యాపారానికి సంబంధించి చర్యలకు పాల్పడుతున్నవారు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారో సీబీఐ కనిపెట్టే పనిలో ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..