ట్రంప్, మోదీ బిగ్ మీటింగ్‌కు రంగం సిద్ధం.. ప్రధాని అమెరికా టూర్ షెడ్యూల్ ఇదే?
అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ బిగ్ మీటింగ్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 12 నుంచి 14వరకు అమెరికాలో మోదీ పర్యటింటనున్నట్లు తెలుస్తోంది. వైట్‌హౌస్‌లో 13వ తేదీన ట్రంప్‌తో మోదీ భేటీ అవుతారు. అక్రమ వలసదారులు, వీసాలు, సుంకాలపై మోదీ, ట్రంప్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఫస్ట్ టైమ్ ఆయనతో మన ప్రధాని మోదీ సమావేశం

అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ బిగ్ మీటింగ్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఫిబ్రవరి 12 నుంచి 14వరకు అమెరికాలో మోదీ పర్యటింటనున్నట్లు తెలుస్తోంది. వైట్‌హౌస్‌లో 13వ తేదీన ట్రంప్‌తో మోదీ భేటీ అవుతారు. అక్రమ వలసదారులు, వీసాలు, సుంకాలపై మోదీ, ట్రంప్ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఫస్ట్ టైమ్ ఆయనతో మన ప్రధాని మోదీ సమావేశం అవుతున్నారు.
అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌కి ప్రధాని మోదీ ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల సంబంధాలపై ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు. రెండు దేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన.. విశ్వాసపూరిత భాగస్వామ్యానికి- భారత్ కట్టుబడి ఉందని ట్రంప్‌కు తెలిపారు మోదీ. భారత్-అమెరికా ప్రజల సంక్షేమానికి, ప్రపంచ శాంతి సౌభాగ్యాల కోసం కలసి పనిచేద్దామని ట్రంప్‌కు వివరించారు మోదీ.
మోదీ, ట్రంప్ చర్చలపై వైట్‌హౌస్ అధికారిక ప్రకటన చేసింది. మోదీని అమెరికా పర్యటనకు ఆహ్వానించడంపై ఈ ఫోన్‌కాల్‌లో చర్చ జరిగిందని తెలిపింది. అలాగే రెండుదేశల మధ్య పరస్పర సహకారం పెంపొందించుకోవడంపై ట్రంప్, మోదీ మధ్య చర్చ జరిగిందని అమెరికా అధ్యక్ష కార్యాలయం ఆ ప్రకటనలో వివరించింది. దీంతోపాటు అమెరికా తయారుచేసిన ఆయుధాల కొనుగోళ్లను పెంచాల్సిన అవసరాన్ని భారత్‌కు విజ్ఞప్తి చేసినట్లు వైట్‌హౌస్ తెలిపింది. పారదర్శకమైన ద్వైపాక్షిక వాణిజ్య బంధాన్ని పెంచాలని కూడా మోదీని ట్రంప్ కోరారు. మరోవైపు రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ జరిగింది. ఈ ఏడాది తొలిసారి భారత్‌లో క్వాడ్ సదస్సు నిర్వహణపై మోదీ, ట్రంప్ ఈ ఫోన్‌కాల్‌లో చర్చించారని వైట్‌హౌస్ వివరించింది.
అయితే ఇప్పటికే అక్రమ వలసదారులపై అమెరికా కొరడా ఝళిపించింది. అక్రమ వలసలపై మోదీ, సరైన నిర్ణయం తీసుకుంటారని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ట్రంప్- మోదీ బిగ్ మీటింగ్‌లో ఏం జరుగుతుందన్నది ఆసక్తిగా మారింది.