AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌ టు బెంగళూరు బుల్లెట్‌ రైలు.. కేవలం రెండు గంటల్లోనే..

హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్-ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. ఈ కారిడార్‌ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతోపాటు మైసూరు-చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైలు కారిడార్‌ను కూడా హైదరాబాద్ వరకు

హైదరాబాద్‌ టు బెంగళూరు బుల్లెట్‌ రైలు.. కేవలం రెండు గంటల్లోనే..
Bullet Train
K Sammaiah
|

Updated on: Feb 04, 2025 | 12:02 PM

Share

హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్-ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. ఈ కారిడార్‌ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతోపాటు మైసూరు-చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైలు కారిడార్‌ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తోంది. అదే జరిగితే హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరుకు మధ్య ప్రయాణ దూరం గంటల్లోకి తగ్గిపోతుంది.

ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య జపాన్ సంస్థ సాంకేతికత, ఆర్థిక సాయంతో హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ రైలు నడవనుంది. ఆ తర్వాతి దశలో మరిన్ని హైస్పీడ్ కారిడార్లు నిర్మించనున్నారు. వాటిలో పైన పేర్కొన్న హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్, భూగర్భ మార్గాల్లో నిర్మిస్తారు.

హైదరాబాద్-బెంగళూరు మధ్య దూరం 618 కిలోమీటర్లు. సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు 11 గంటలు, వందేభారత్‌లో ఎనిమిదిన్నర గంటల సమయం పడుతోంది. అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటల్లోనే బెంగళూరు చేరుకునే వెసులుబాటు లభిస్తుంది. అలాగే, హైదరాబాద్-చెన్నై మధ్య దూరం 757 కిలోమీటర్లు కాగా, సాధారణ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అయితే 15 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం రెండున్నర గంటలకు తగ్గపోతుంది. అయితే, ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు 10 నుంచి 13 సంవత్సరాలు పడుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం