
Parliament Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభయ్యాయి. ఇవ్వాల్టి నుంచి ఆగస్టు 11 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కాగా.. ఈ సమావేశాల్లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం.. యూనిఫాం సివిల్ కోడ్, ఢిల్లీ ఆర్డినెన్స్ సహా 31 బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దీనికోసం ఇప్పటికే క్యాబినేట్ సమావేశం జరిగింది. కాగా.. ఈ సమావేశాలు మరింత వాడీవేడిగా జరగనున్నాయి. మణిపూర్‌లో హింస, ఢిల్లీ ఆర్డినెన్స్ సహా పలు అంశాలపై విపక్షాలు నిలదీసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు INDIA కూటమి నేతలు కూడా సమావేశం అయ్యారు. రాజ్యసభ ప్రతిపక్ష నేత చాంబర్‌లో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరుగుతోంది. దీంతో విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార పక్షం కూడా ప్రతి వ్యూహాలతో సిద్ధమైంది. ఈ క్రమంలో ప్రతి అంశంపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం ప్రభుత్వం స్పష్టంచేసింది. సమావేశాలకు సహకరించాలని కేంద్రం విపక్షాలకు సూచించింది. 31 బిల్లులను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలు కాగానే.. సిట్టింగ్ సభ్యుల మరణానికి సంతాపం తెలుపుతూ ఉభయ సభలు తీర్మానం చేశాయి. దివంగత సభ్యులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ రెండు సభల్లోనూ సభ్యులు కాసేపు మౌనం పాటించారు. ఆ తర్వాత ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ మధ్యాహ్నం రెండు గంటలకు తిరిగి సమావేశం కానుంది. రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి సమావేశం కానుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..