Rafale Fighter Jet: భారత్‌కు మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు.. మరింత పటిష్టం కానున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..

Rafale Fighter Jet: భారతదేశ సైనిక శక్తి దినదినాభివృద్ధి చెందుతోంది. సైన్యం చేతికి అత్యాధునిక ఆయుద సంపత్తి..

Rafale Fighter Jet: భారత్‌కు మరో మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు.. మరింత పటిష్టం కానున్న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్..
Rafale Fighter Jet
Follow us
Shiva Prajapati

|

Updated on: Mar 31, 2021 | 2:10 PM

Rafale Fighter Jet: భారతదేశ సైనిక శక్తి దినదినాభివృద్ధి చెందుతోంది. సైన్యం చేతికి అత్యాధునిక ఆయుద సంపత్తి వచ్చి చేరుతోంది. చూట్టూ వైరి దేశాలే ఉండటంతో మరింత అప్రమత్తంగా ఉంటోంది దేశ రక్షణ శాఖ. ఆ కారణంగానే శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇప్పటికే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న భారత త్రివిధ దళాలు.. మరింత ముందడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అత్యంత శక్తివంతమైన రాఫెల్ ఫైటర్ జెట్లు కొన్ని వైమానిక దళంలో చేరగా.. ఇవాళ మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు రానున్నాయి. ఈ ఫైటర్ జెట్లను తీసుకువచ్చేందుకు భారత వైమానిక బృందం ఫ్రాన్స్‌కు వెళ్లింది. ఇవాళ రాత్రి 7 గంటల లోపు ఫ్రాన్స్ నుంచి ఆ రాఫెల్ ఫైటర్ జెట్లను ఇండియాకు తీసుకురానున్నారు. ఈ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి నేరుగా గుజరాత్‌కు చేరుకుంటాయి. అయితే, మధ్యలో యూఏఈలో ఆగి ఇంధనం నింపుకోనున్నాయి. ఇప్పటికే 11 రాఫెల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరిన విషయం తెలిసిందే.

ఇదిలాఉంటే.. భారత ప్రభుత్వం 2016 సెప్టెంబర్ నెలలో ఫ్రాన్స్ ప్రభుత్వంతో రూ. 59 వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్.. తొలి విడతగా ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేయగా.. గతేడాది జులై 28న అవి దేశానికి చేరుకున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 11 రాఫెల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. ఇప్పుడు మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు భారత్‌కు రానున్నాయి. దీంతో వీటి సంఖ్య 14కు చేరనుంది. అలాగే.. మరో ఐదు ఫైటర్ జెట్లను ఏప్రిల్ చివరి నాటికి భారత్‌కు అప్పగించనున్నట్లు ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన రాఫెల్ ఫైటర్ జెట్లతో పాటు.. ఇప్పుడు వస్తున్న.. త్వరలో రాబోతున్న ఫైటర్ జెట్లు భారత వైమానిక దళంలోని గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్‌లో భాగం కానున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలను.. లడఖ్ సరిహద్దుల్లో మోహరించారు.

Also read:

Ghost Builts Shiva Temple: ఒక్క రాత్రిలో శివునికి ఆలయం .. దెయ్యాల పనే అంటున్న స్థానికులు.. ఎక్కడ ఉందో తెలుసా..!

Retaining Wall: కృష్ణలంక వాసుల వరద కష్టానికి అడ్డుకట్ట.. రిటైనింగ్ వాల్‌ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన..

కొత్త ఏడాది కిక్కోకిక్కు.. ఒక్క రాత్రిలో రూ.402కోట్ల మద్యం హాంఫట్
కొత్త ఏడాది కిక్కోకిక్కు.. ఒక్క రాత్రిలో రూ.402కోట్ల మద్యం హాంఫట్
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్..
హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!
హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!
కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!
కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..