విషాదం.. ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. దంతెవాడ జిల్లాలోని గీడం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరోకరు గాయపడ్డారు. అయితే ఈ ట్రాక్టర్..

  • Tv9 Telugu
  • Publish Date - 3:15 pm, Sun, 12 July 20
విషాదం.. ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మృతి

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. దంతెవాడ జిల్లాలోని గీడం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరోకరు గాయపడ్డారు. అయితే ఈ ట్రాక్టర్ నడుపుతున్న డ్రైవర్‌ ప్రమాదం నుంచి తప్పించుకుని పారిపోయాడు. ఈ విషయాన్ని గీడం పోలీస్ స్టేషన్ ఆఫీసర్ గోవింద్ యాదవ్ తెలిపారు. ఐదు మందితో వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిందని.. ఈ క్రమంలో అందులో ఉన్న ముగ్గురు స్పాట్‌లోనే మరణించారని తెలిపారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడని.. అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే ట్రాక్టర్‌ డ్రైవర్‌ బోల్తా పడే సమయంలో తప్పించుకుని పారపోయాడన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. డ్రైవర్‌ కోసం గాలిస్తున్నామని గీడం ఎస్‌హెచ్‌ఓ గోవింద్ యాదవ్‌ తెలిపారు.