
గత వారం రోజులుగా ఈశాన్య రాష్ట్రాలు భారీ వర్షాలతో వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. సిక్కింలో భారీ వర్షాలు, వరదలతో కొండచరియలు విరిగిపడ్డాయి. సిక్కింలోని ఒక మిలిటరీ శిబిరంపై భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందినట్టుగా తెలిసింది. మరో ఆరుగురు భద్రతా సిబ్బంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం విస్తృత గాలింపు కొనసాగుతోంది. కొండచరియలు ఆకస్మికంగా శిబిరంపై పడటంతో భారీ నష్టం జరిగింది. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
సిక్కింలోని లాచెన్ జిల్లా చాటెన్ వద్ద ఆదివారం సాయంత్రం 7 గంటలకు భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురు జవాన్ల మృతదేహాలను వెలికితీశామని, ఆరుగురు సైనికులు గల్లంతయ్యారని రక్షణ అధికారి ఒకరు ఒక ప్రకటనలో తెలిపారు. భారత సైన్యం తక్షణమే సహాయక చర్యలను ప్రారంభించిందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..