Omicron Cases in India: దేశంలో మరోసారి ఒమిక్రాన్ కలకలం.. 26కు చేరిన మొత్తం కేసుల సంఖ్య

|

Dec 10, 2021 | 5:51 PM

Omicron Varient: భారత్‌లో మరోసారి ఒమిక్రాన్‌ కేసులు కలకలం రేపాయి. మరో మూడు కేసులు శుక్రవారంనాడు నమోదయ్యాయి.

Omicron Cases in India: దేశంలో మరోసారి ఒమిక్రాన్ కలకలం.. 26కు చేరిన మొత్తం కేసుల సంఖ్య
Omicron Variant
Follow us on

Omicron Varient: భారత్‌లో మరోసారి ఒమిక్రాన్‌ కేసులు కలకలం రేపాయి. దేశంలో మరో మూడు కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 26కు చేరింది.  తాజాగా మహారాష్ట్రలో ఓ కేసు, గుజరాత్‌లో రెండు ఒమిక్రాన్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. జామ్‌నగర్‌లో ఇద్దరికి ఒమిక్రాన్‌ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తికి ఇప్పటికే అక్కడ ఒమిక్రాన్‌ వచ్చింది. ఆ వ్యక్తితో టచ్‌లో ఉన్న ఇద్దరికి ఒమిక్రాన్‌ వేరియంట్‌ నిర్ధారణ కావడం సంచలనం రేపింది. గుజరాత్‌లో ఇది మూడో ఒమిక్రాన్ కేసు.  గుజరాత్‌లో తాజాగా ఒమిక్రాన్‌ నిర్ధారణ అయిన వాళ్లను క్వారంటైన్‌ చేశారు. టాంజానియా నుంచి ముంబైలోకి ధారావికి వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ నిర్థారణ కావడంతో సెవెన్‌హిల్స్ ఆస్పత్రిలో చికిత్స కల్పిస్తున్నారు.

దీంతో దేశంలో ఇప్పటి వరకు 25 ఒమిక్రాన్ కేసులు నిర్థారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. మహారాష్ట్రలో కేసు నిర్ధారణకు ముందు ఆయన ఈ ప్రకటన చేశారు. అయితే  ఒమిక్రాన్ బారినపడిన వారిలో అందరిలోనూ తేలికపాటి లక్షణాలే ఉన్నట్లు తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు అత్యధికంగా మహారాష్ట్రలో 11 ఒమిక్రాన్ కేసులు నిర్థారణ కాగా.. రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒక ఒమిక్రాన్ కేసు నిర్ధారణ అయ్యాయి.

Also Read..

Viral Video: చిన్నారి ప్రమాణిస్తోన్న కార్ మాత్రమే కాదు.. తన మనసు కూడా చాలా రిచ్.. మనసును కదిలించే వీడియో

Telangana: ముగిసిన స్థానిక సంస్థల కోటా MLC ఎన్నికలు.. అన్ని చోట్ల భారీగా ఓటింగ్