సబ్బు పెట్టెలు అమ్ముకునే ఓ అమాయకురాలైన యువతిని మిజోరాం పోలీసులు మంగళవారం (ఫిబ్రవరి 14) అరెస్ట్ చేశారు. పైకి సోప్ పెట్టెలు అమ్ముతూనే.. వాటి మాటున కోట్ల రూపాయల దందా నడుపుతున్న సదరు కిలాడి లేడీని పోలీస్ స్పెషల్ బృందం చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకెళ్తే.. మిజోరంలోని ఐజ్వాల్ సమీపంలోని రంగ్వమువల్‌లో లల్రామ్మావీ అనే యువతి ఉద్యోగంలేదని ఓ సెంటర్‌లో ఖాళీ సబ్బు పెట్టెలు అమ్ముకుంటోంది. ఒక్కో పెట్టె ఖరీదు రూ.10ల చొప్పున అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. నిత్యం ఎందరో ఆమె వద్ద సబ్బుపెట్టెలు కొని డబ్బు చెల్లించి వెళ్తుంటారు. కేవలం సబ్బు పెట్టెలను మాత్రమే అమ్ముతుందని అందరూ అనుకున్నారు. ఐతే ఈ సబ్బు పెట్టెల వెనుక జరుగుతోన్న కోట్ల రూపాయల దందాను తాజాగా పోలీసులు ఛేదించారు.
ఐజ్వల్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు రాత్రికి రాత్రే యువతి ఇంటిపై దాడి చేసి 21 సబ్బు పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. మామూలు సోప్ బాక్స్‌లు అమ్ముకునే యువతిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలియక అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. దాదాపు 1.19 కోట్ల రూపాయల విలువైన 239.95 గ్రాముల కొకైన్ ఉన్న 21 పోస్ బాక్స్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లల్రామ్మావీ యువతి అమ్ముతోన్న మత్తుపదార్థాలను మీడియా ముందుంచారు.
Mizoram | District Special Branch, Aizawl launched an op last night & seized 21 soap cases of suspected heroin weighing 239.95 grams from a woman, at her residence at Rangvamual. She was identified as Lalrammawii. Market value of the seized drug is around Rs 1.19 crore. pic.twitter.com/EPH498Cx1h
— ANI (@ANI) February 14, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.