Spurious liquor: కల్తీ మద్యం తాగి 21 మంది మృతి.. 40 మందికి తీవ్ర అస్వస్థత! బాధితులంగా రోజువారి కూలీలే..

పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇథనాల్‌తో కూడిన మద్యం సేవించడం వల్ల ఈ దారుణం చోటు చేసుకుంది. మరో 40 మంది ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. పంజాబ్‌లోని అయ్యారుసంగ్రూర్‌ జిల్లాలో పలు గ్రామాల్లో ఈ సంఘటన వెలుగు చూసింది. సంగ్రూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) తెలిపిన వివరాల ప్రకారం..

Spurious liquor: కల్తీ మద్యం తాగి 21 మంది మృతి.. 40 మందికి తీవ్ర అస్వస్థత! బాధితులంగా రోజువారి కూలీలే..
Spurious Liquor

Updated on: Mar 24, 2024 | 11:44 AM

చండీగఢ్‌, మార్చి 24: పంజాబ్‌లో కల్తీ మద్యం తాగి 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇథనాల్‌తో కూడిన మద్యం సేవించడం వల్ల ఈ దారుణం చోటు చేసుకుంది. మరో 40 మంది ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. పంజాబ్‌లోని అయ్యారుసంగ్రూర్‌ జిల్లాలో పలు గ్రామాల్లో ఈ సంఘటన వెలుగు చూసింది. సంగ్రూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) తెలిపిన వివరాల ప్రకారం..

పంజాబ్‌లోని అయ్యారుసంగ్రూర్‌ జిల్లాలో పలు గ్రామాలకు చెందిన వారు గత బుధవారం (మార్చి 20) మద్యం సేవించారు. దీంతో అదే రోజు నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. మరికొందరు ఆస్పత్రి పాలయ్యారు. మరోసటి రోజు పాటియాలాలోని రాజింద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు. ఇక శుక్రవారం (మార్చి 22) ఎనిమిది మంది మరణించారు. ఆ మరుసటి రోజు అంటే శనివారం (మార్చి 23) మరో ఐదుగురు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 21కి చేరింది. ఇప్పటి వరకు దాదాపు 40 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిని దవాఖానలకు తరలించగా కొందరి పరిస్థితి విషయమంగా ఉంది. బాధితులంతా రోజువారీ కూలీలు. మద్యంలో మిథనాల్‌ కలవడం వల్లనే ఈ ఘటనకు కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది.

పంజాబ్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. అదుపులోకి తీసుకున్న నిందితులు విచారణలో షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. ఓ ఇంట్లో కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆ ఇంటిపై దాడి చేసి 200 లీటర్ల ఇథనాల్, ఓ విధమైన విష రసాయనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని, దోషులను విడిచిపెట్టబోమని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హర్చరణ్ సింగ్ భుల్లర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.