AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nobel Prize: 2026 రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మక ‘నోబెల్ బహుమతి’ ప్రకటన

2026 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలను వరించింది. ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి. కాగన్ (Henri B. Kagan), జపాన్‌కు చెందిన కెన్సో సోయ్ (Kensō Soai)లు సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. అసిమ్మెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్‌లో నాన్-లీనియర్ ఎఫెక్ట్స్ (Non-linear effects), ఆటోక్యాటాలసిస్ (Autocatalysis)పై చేసిన కీలక పరిశోధనలకు గుర్తింపుగా వీరికి ఈ అవార్డు లభించింది.

Nobel Prize: 2026 రసాయన శాస్త్రంలో ప్రతిష్టాత్మక 'నోబెల్ బహుమతి' ప్రకటన
Nobel Prize
Subhash Goud
|

Updated on: Oct 07, 2026 | 4:50 PM

Share

2026 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇద్దరు ప్రముఖ శాస్త్రవేత్తలను వరించింది. ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ బి. కాగన్ (Henri B. Kagan), జపాన్‌కు చెందిన కెన్సో సోయ్ (Kensō Soai)లు సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. అసిమ్మెట్రిక్ ఆర్గానిక్ సింథసిస్‌లో నాన్-లీనియర్ ఎఫెక్ట్స్ (Non-linear effects), ఆటోక్యాటాలసిస్ (Autocatalysis)పై చేసిన కీలక పరిశోధనలకు గుర్తింపుగా వీరికి ఈ అవార్డు లభించింది.

రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అక్టోబర్ 7, 2026న విజేతలను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది కెమిస్ట్రీ నోబెల్ బహుమతి మొత్తంగా 12 మిలియన్ స్వీడిష్ క్రోనర్ కాగా, ఈ మొత్తాన్ని ఇద్దరు విజేతలు సమానంగా పంచుకోనున్నారు.

ఇంతకీ వీరి పరిశోధన ఎందుకు అంత ముఖ్యమైనది? మన చుట్టూ ఉన్న అనేక అణువులు ఒకదానికొకటి అద్దంలో కనిపించే ప్రతిబింబాల మాదిరిగా రెండు రూపాల్లో ఉండగలవు. వీటిని మిర్రర్-ఇమేజ్ మాలిక్యూల్స్ లేదా ఎనాంటియోమర్స్ (Enantiomers) అంటారు.

సులభంగా చెప్పాలంటే మన ఎడమ, కుడి చేతులు ఒకదానికొకటి అద్దం ప్రతిబింబాల్లా ఉంటాయి. చూడటానికి ఒకేలా కనిపించినా వాటిని పూర్తిగా ఒకదానిపై మరొకటి ఉంచలేం. రసాయన అణువుల్లోనూ ఇలాంటి లక్షణం ఉంటుంది. దీనినే చిరాలిటీ (Chirality) అంటారు.

Follow Us