అయితే విగ్రహం పూర్తిగా తయారయ్యేందుకు మరికొన్ని రోజులు పడుతుందని పూజా మండప నిర్వాహకుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, సింగర్ కూడా అయిన అదితి మున్షీ తెలిపారు. ఈ మండపం లోనే థర్మల్ గన్, సిరంజ్, ఇతర మెడికల్ సాధనాలు కూడా ఉంటాయని ఆయన చెప్పారు. ఇక్కడికి వచ్చే భక్తులు కోవిడ్ నుంచి తమను తాము రక్షించుకుని తమ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్న థీమ్ తోనే..వారిలో అవగాహన కలిగించడానికే ఈ ఏర్పాటు చేసినట్టు ఆయన వివరించారు. దుర్గా మాత విగ్రహానికి 20 గ్రాముల బంగారు మాస్క్ అవసరమా అని తమను తప్పు పట్టేవారుంటారని..ఇంత ఖర్చు ఎందుకని ప్రశ్నించేవారు కూడా ఉంటారని.. కానీ తమ ఉద్దేశం ఇదేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న దృష్ట్యా తామిలా సరికొత్త నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి కూతురు బెంగాల్ గోల్డెన్ గర్లే అని వ్యాఖ్యానించిన ఆయన.. ప్రతివారూ మాస్కులు ధరించాలని డాక్టర్లు ఇచ్చే సూచన పాటించడం కష్టమేనని.. కానీ ఇలా చేయడం వల్ల భక్తులు, ప్రజల్లో కొంతయినా చైతన్యం వస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
పెరిగిన కోవిడ్ కేసుల దృష్ట్యా.. పూజా మండపాలను దర్శించే భక్తులు కూడా విధిగా మాస్కులు ధరించాలని కలకత్తా హైకోర్టు గతంలో ఇచ్చిన ఇంజంక్షన్ ఉత్తర్వులను అదితి మున్షీ గుర్తు చేశారు. కానీ చాలామంది ఈ ఉత్తర్వులను పాటించడంలేదన్నారు. ఈ కారణం వల్లే తామీ నిర్ణయం తీసుకున్నామన్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: పాకిస్తాన్ లోని క్వెట్టాలో బాంబు పేలుడు.. ఇద్దరు పోలీసుల మృతి.. 13 మందికి గాయాలు
యువతులు ఈ 4 రాశుల వారిని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతారు..! ఎందుకంటే..?