shocking ! 18 నెలల చిన్నారిలో బ్లాక్ ఫంగస్…రాజస్తాన్ లో తొలి కేసు.., డాక్టర్లకే పెను సవాల్ ! పరిశోధనలు ముమ్మరం

| Edited By: Phani CH

May 27, 2021 | 11:52 AM

ఇండియాలో బ్లాక్ ఫంగస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కోవిద్ బారి నుంచి కోలుకున్న రోగులకే ఇది సోకుతుందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చాం..

shocking ! 18 నెలల చిన్నారిలో బ్లాక్ ఫంగస్...రాజస్తాన్ లో తొలి కేసు.., డాక్టర్లకే పెను సవాల్ ! పరిశోధనలు ముమ్మరం
Child
Follow us on

ఇండియాలో బ్లాక్ ఫంగస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కోవిద్ బారి నుంచి కోలుకున్న రోగులకే ఇది సోకుతుందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చాం..కానీ ఇప్పుడు కల్లాకపటం తెలియని, ఏ వ్యాధి కూడా సోకని శిశువుల్లో కూడా ఇది కనబడడం డాక్టర్లకు ఆశ్చర్యం కలిగిస్తోంది. రాజస్తాన్ లోని బికనీర్ లో 18 నెలల చిన్నారితో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనబడ్డాయి. దేశంలో ఇదే మొట్టమొదటి కేసు. ఇలాగే గుజరాత్ లో 15 ఏళ్ళ బాలుడిలోనూ ఈ వ్యాధి సోకిన ఉదంతం తెలిసింది. మ్యుకోర్ మైసిటీస్ గా వ్యవహరిస్తున్న ఈ ఫంగస్ మొదట ముక్కును, ఆ తరువాత కళ్ళు తదితర భాగాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. చివరకు ఊపిరి తిత్తులకు కూడా ఇది సోకుతుందని అంటున్నారు. సాధారణంగా తలనొప్పి, ముఖం ఉబ్బడం, ముక్కు మూసుకుపోవడం, జ్వరం వంటివి ఈ బ్లాక్ ఫంగస్ లో కనిపిస్తాయని ఢిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ డా. రణదీప్ గులేరియా తెలిపారు. కోవిద్ నుంచి కోలుకున్నవారు స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినందున ఇది సోకుతుందన్నారు. 90 నుంచి 95 శాతం డయాబెటిస్ రోగులు దీనికి త్వరగా గురయ్యే అవకాశం ఉందన్నారు. అయితే డయాబెటిక్ కానివారిలో కూడా ఇది కనబడుతుందని, కానీ ఇవి అరుదైన కేసులని ఆయన చెప్పారు.

దేశంలో 11,712 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదైనట్టు కేంద్ర మంత్రి సదానంద గౌడ నిన్న ప్రకటించారు. ముఖ్యంగా వీటిలో గుజరాత్, మహారాష్ట్ర టాప్ స్థానంలో ఉన్నాయన్నారు. దీనికి అవసరమైనన్ని మందులు అందుబాటులో ఉన్నట్టు ఆయన చెప్పారు. అయితే ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చు ఎక్కువగానే ఉంటోంది. చిన్నారుల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు కనబడడంతో పరిశోధకులు తమ రీసెర్చ్ ని ముమ్మరం చేశారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Sonu Sood: యాంకర్‌ వింధ్యా విశాఖను ప్రశంసించిన సోనూసూద్.. ఎందుకో తెలుసా..?

Amazon New CEO Andy Jassy: అమెజాన్‌ కొత్త సీఈవో ఖరారు.. జూలై 5న సీఈవో పదవి నుంచి తప్పుకుంటానన్న జెఫ్ బెజోస్