AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఇవి కీరదోస అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే దిమ్మతిరుగుద్ది

తమిళనాడులోని నాగపట్టణంలో సముద్ర జీవుల అక్రమ రవాణా మరింత తీవ్రరూపం దాల్చింది. శ్మశానవాటిక వెనక దాచి ఉంచిన 150 కిలోల సీ క్యూకంబర్లు సీజ్ చేసిన అధికారులు... ఇవి శ్రీలంకకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. తరచూ జరుగు అక్రమ సీజ్‌ల మధ్య ఇది మూడవసారి కావడం గమనార్హం.

Viral: ఇవి కీరదోస అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే దిమ్మతిరుగుద్ది
Sea Cucumbers
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Jul 12, 2025 | 9:55 PM

Share

తమిళనాడు నాగపట్టణం జిల్లా కీచంకుప్పం సమీపంలో సీ క్యూకంబర్లు అనే సముద్ర జీవులను అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పెద్ద ఎత్తున వాటిని పట్టుకున్నారు. శనివారం జరిగిన ఈ ఆపరేషన్‌లో 150 కిలోల సీ క్యూకంబర్లు సీజ్ చేశారు. వీటి విలువ సుమారుగా రూ. 4 లక్షలు ఉంటుందని అంచనా. ఈ దాడిని అటవీశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు కలిసి నిర్వహించారు. ఇది ఈ నెలలో జరిగిన మూడవ సీజ్ కావడం గమనార్హం. తరచూ జరుగుతున్న ఈ అక్రమ రవాణా నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

అధికారులకు వచ్చిన సమాచారం మేరకు కీచంకుప్పం సాల్ట్ రోడ్ ప్రాంతంలోని శ్మశానవాటిక వెనుక భాగంలో దాడులు నిర్వహించారు. అక్కడ ఉప్పుతో నింపిన ప్లాస్టిక్ డబ్బాలలో ఈ సీ క్యూకంబర్లను దాచి ఉంచినట్టు గుర్తించారు. వీటిని రామేశ్వరం మార్గంగా శ్రీలంకకు తరలించేందుకు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఈ అక్రమ రవాణా వెనుక మురుగనంధం అనే వ్యక్తి హస్తం ఉన్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. అతను సాల్ట్ రోడ్‌కు చెందినవాడు. దాడి సమయంలో అతను అక్కడి నుండి పరారయ్యాడు. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం… ఇతనిపై గతంలోనే 20కి పైగా సీ క్యూకంబర్ అక్రమ రవాణా కేసులు ఉన్నాయి.

సీ క్యూకంబర్లు తూర్పు ఆసియాలో ఓ రెసిపీగా.. సాంప్రదాయ ఔషధాల్లో ఉపయోగిస్తారు. కానీ భారత్‌లో ఇవి వన్యప్రాణి రక్షణ చట్టం షెడ్యూల్ – Iలో ఉన్నాయి. అంటే వీటి వేట, నిల్వ, రవాణా, అమ్మకాలు పూర్తిగా నిషేధించారు. ఈ జీవులు సముద్ర అడుగుని శుభ్రంగా ఉంచడంలో, సముద్ర జీవవైవిధ్యాన్ని కాపాడడంలో చాలా కీలకంగా ఉంటాయి. అందుకే వాటి సంరక్షణ అవసరమని అధికారులు చెబుతున్నారు. ఇటీవల వరుసగా చోటుచేసుకుంటున్న ఈ తరహా ఘటనల నేపథ్యంలో నాగపట్టణం తీరప్రాంతం మొత్తంలో నిఘా పెంచినట్లు అధికారులు వెల్లడించారు. అక్రమంగా సముద్ర జీవులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Follow Us
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
ట్రంప్ ఆరోగ్యంపై నెట్టింట వైరల్.. స్పందించిన వైట్ హౌస్..నిజమేంటి?
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
చెన్నై హ్యాట్రిక్‌ ఓటమి.. అగ్రస్థానానికి ఆర్‌సీబీ
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
గాడిదను తేలిగ్గా తీసుకోవద్దు.. అవి మనిషికి నేర్పే 5 జీవిత పాఠాలు.
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
చిలుకకు ‘రామ చిలుక’ అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసా..?
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
పాక్‌ నుంచి భారత్‌లోకి సీక్రెట్‌ డ్రోన్స్.. గుర్తించి ఓపెన్ చేయగా
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
15 ఏళ్లకే ప్రపంచ రికార్డులో చేరిన వైభవ్.. అదేంటో తెలుసా?
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్
ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్