దేశ రాజధానిలో పేలిన సిలిండర్‌.. 14 మందికి గాయాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఎల్పీజీ సిలిండర్ పేలుడు కలకలం సృష్టించింది. టిగ్రీ ప్రాంతంలోని జేజే క్యాంపు జుగ్గీలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో..

దేశ రాజధానిలో పేలిన సిలిండర్‌.. 14 మందికి గాయాలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 08, 2020 | 11:08 PM

దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఎల్పీజీ సిలిండర్ పేలుడు కలకలం సృష్టించింది. టిగ్రీ ప్రాంతంలోని జేజే క్యాంపు జుగ్గీలో సిలిండర్ పేలింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే.. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక సఫదర్‌ గంజ్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలికి చేరుకున్న ఎనిమిది ఫైర్ ఇంజన్లు మంటలు చెలరేగకుండా ప్రయత్నాలు చేశారు. ఓ ఇంట్లో వంట చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు.

Read More :

మహారాష్ట్రలో 5లక్షలు దాటిన కేసులు