ఝార్ఖండ్‌లో పిడుగులు విధ్వంసం కొనసాగింది. గత రెండు రోజుల్లో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి మొత్తం 12 మంది మృత్యువాతపడ్డారు. ధన్‌బాద్, జెంషెడ్‌పూర్, గుమ్లా, చత్రా, హజారీ బాగ్, రాంచీ , బొకారో తదితర ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయని అధికారులు వెల్లడించారు. మే 26న ధన్‌బాద్ జిల్లా బర్వద్దా ఏరియాలో తల్లీకూతుళ్లు పిడుగుపాటుకు గురయ్యారు. జెంషెడ్‌పూర్ లోని భ్రగోరా, గుమ్లా జిల్లా చిరోఢి వద్ద ఇద్దరు ,లోహర్‌డగ్గా వద్ద ఒకరు చనిపోయారు. గురువారం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చత్రా, హజారీబాగ్, రాంచీ, బొకారో, ఖుంతి జిల్లాల్లో ఒక్కొక్కరు వంతున , పాలము జిల్లాలో హుస్సేనాబాద్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
ఆయా జిల్లాల అధికారులు ఈ మరణాల వివరాలను పరిశీలించి తెలియజేస్తే ఆయా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం అందించడమౌతుందని ఎస్‌డిఆర్‌ఎస్ విభాగం తెలియజేసింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల వంతున రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గత రెండు రోజుల్లో రాష్ట్రంలో ఈదురుగాలులు, మెరుపులు, పిడుగులతో వర్షం కురిసింది. అనేక ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలాయి.
రాష్ట్రంలో గత రెండు రోజులుగా ఈదురు గాలులు, వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. జెంషెడ్‌పూర్‌లో శుక్రవారం 79 మిమీ వర్షం కురిసింది. బొకారోలో 52.4 మిమీ, రాంచీలో 5.9 మిమీ వర్షం కురిసింది. ఉత్తర బీహార్, ఉత్తర ఒడిశా నుంచి హర్యానా నుంచి సిక్కిం వరకు అల్పపీడన ద్రోణి కారణంగా ఝార్ఖండ్‌లో పిడుగల వాన కురిసిందని రాంచీ వాతావరణ విభాగం ఇన్ ఛార్జి అభిషేక్ ఆనంద్ వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..