ఎప్పటిలానే ఆ రోజు కూడా కస్టమ్స్ అధికారులు, పోలీసులు కలిసి ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ఫ్లైట్ అప్పుడే ల్యాండ్ అయింది. ప్రయాణీకులు ఒక్కొక్కరిగా ఎగ్జిట్ నుంచి లోపలికి వస్తున్నారు. ఇంతలో అధికారులకు ఓ వ్యక్తి కదలికలపై అనుమానమొచ్చింది. అతడ్ని పూర్తిగా తనిఖీ చేయగా.. చివరికి ఓ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ బయటపడింది. ఇంతకీ అసలేం జరిగిందంటే..
చెన్నై విమానశ్రయంలో బంగారం అక్రమ రవాణా చేస్తోన్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతడి దగ్గర నుంచి రూ. 60.58 లక్షలు విలువైన దాదాపు 1128 గ్రాముల 24 కారెట్ల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి గురువారం అర్ధరాత్రి వచ్చిన ప్రయాణీకుడు దగ్గర నుంచి మోకాలి బ్యాండేజ్‌లో దాచిపెట్టిన 1128 గ్రాముల బంగారాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.
Based on Intel, one pax who arrived from Dubai by flight EK-546 on 20.04.23 was intercepted by Customs.
On search of his person, gold of 24K purity concealed in knee brace totally weighing 1128 grams valued at ₹60.58 lakh was recovered/ seized under the Customs Act, 1962. pic.twitter.com/HwuCZupnZy— Chennai Customs (@ChennaiCustoms) April 21, 2023