ఇంట్లో చేతివాటం ప్రదర్శించిన ఘనుడు.. కొడుకుపైనే కేసు పెట్టిన తండ్రి

సాధరణంగా కొడుకు లేదా కూతుర్లకు ఏదైన ఆపద వస్తే తల్లిదండ్రులు ఆదుకుంటారు. అవసరమైతే పోలీసులను సైతం ఆశ్రయిస్తారు. కానీ ఇక్కడ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే తన కొడుకుపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగింది. తండ్రి కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏంటి అని అనుకుంటున్నారా ? ఇది నిజమే. అయితే ఆ తండ్రి ఇలా ఫిర్యాదు చేయడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది.

ఇంట్లో చేతివాటం ప్రదర్శించిన ఘనుడు.. కొడుకుపైనే కేసు పెట్టిన తండ్రి
Handcuffs

Updated on: Sep 22, 2023 | 7:09 PM

సాధరణంగా కొడుకు లేదా కూతుర్లకు ఏదైన ఆపద వస్తే తల్లిదండ్రులు ఆదుకుంటారు. అవసరమైతే పోలీసులను సైతం ఆశ్రయిస్తారు. కానీ ఇక్కడ ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే తన కొడుకుపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం ఆశ్చర్యం కలిగింది. తండ్రి కొడుకుపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏంటి అని అనుకుంటున్నారా ? ఇది నిజమే. అయితే ఆ తండ్రి ఇలా ఫిర్యాదు చేయడానికి కూడా ఓ బలమైన కారణం ఉంది. అదేంటంటే అతని కొడుకు ఇంట్లో నుంచి ఏకంగా 7 లక్షల 40 వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించాడు. అయితే అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయిలోని అందేరీ ఈస్ట్ ప్రాంతంలో సెల్విన్ అర్మదురై (48) అనే వ్యాపారవేత్త తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. అతని కొడుకు ఎడిన్ జాయ్ (160 ) స్థానికంగా ఉన్న ఓ కళాశాలలో ఇంటర్మీడియడ్ చదువుతున్నాడు. అలాగే అతని కూతురు (14) తొమ్మిదవ తరగతి చదువుతోంది.

సెల్విన్ మొదటి భార్య గతంలో మృతి చెందింది. అయితే ఈ ఇద్దరు పిల్లలు కూడా తన మొదటి భార్య సంతానమే. ఆ తర్వాత అతడు జబా అనే మరో మహిళను రెండవ వివాహం చేసుకున్నాడు. అయితే సెల్వన్ తన మొదటి భార్య, పిల్లలకు చెందినటువంటి బంగారు ఆభరణాలను.. తన ఇంటి పక్కన ఉంటున్న చెల్లెలికి అప్పగించాడు. అయితే అతని చెల్లెలు తమిళనాడులో ఉన్న తన స్వస్థలానికి వెళ్లాలనుకుంది. దీంతో ఆమె సోదరుడు సెల్విన్ తనకు అప్పగించిన బంగారు ఆభరణాలను భద్రత కోసం.. అతనికే అప్పగించింది. వాటిని తీసుకున్న సెల్విన్ ఓ ప్లాస్టిక్ పౌచ్‌లో పెట్టి బెడ్‌ లోపల భద్రపరిచాడు. అతని భార్య, సోదరికి మాత్రమే ఆ బంగారు ఆభరణాలు అతడు ఎక్కడ దాచిపెట్టాడో తెలుసు. అయితే సెప్టెంబర్ 11వ తేదిన వారి బంధువులకు చెందిన ఓ పెళ్లి కార్యక్రమం కోసం.. సెల్పిన్ కూతురు బంగారు ఆభరణాలు వేసుకునేందుకు ఆసక్తి చూపించింది.

దీంతో అప్పటికే తమ స్వస్థలం నుంచి వచ్చిన సెల్విన్ సోదరీ, అతని భార్య.. ఆ ఆభరణాలను దాచిపెట్టిన బెడ్‌ను తెరిచారు. కానీ ఆ ప్లాస్టిక్ పౌచ్‌లో ఉండాల్సిన బంగారు ఆభరణాలు అందులో లేవు. దీంతో వారు కంగారుపడిపోయి ఈ విషయాన్ని సెల్విన్‌కు చెప్పారు. అతడు ఆ బంగారు ఆభరణాలు గురించి తన కొడుకు ఎడిన్ జాయ్‌ను అడిగాడు. అతని కొడుకు చెప్పిన మాటలు విని ఒక్కసారిగా సెల్విన్ కంగుతిన్నాడు. స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఆ బంగారు ఆభరణాలను దొంగిలించి.. అమ్మేశానని ఎడిన్ జాయ్‌ చెప్పాడు. ఎడిన్ దొంగిలించిన వాటిలో 7 లక్షల 40 వేల రూపాయల విలువైన.. బంగారు నక్లెస్‌లు,చైన్లు, గాజులు, చెవి కమ్మలు, ఉంగరాలు, బ్రేస్‌లైట్లు ఉన్నాయి. ఇక చివరికి చేసేదేమి లేక.. సెప్టెంబర్ 18వ తేదిన సెల్విన్ తన కొడుకుపై సహర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అతని కొడుకును ఇంతవరకు అరెస్టు చేయలేదు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం