Vande Bharat: పట్టాలెక్కిన 10 వందే భారత్ రైళ్లు.. వర్చువల్ గా ప్రారంభించిన మోదీ, విశాఖ-సికింద్రాబాద్ మధ్య రైలు కూడా!
దేశంలోని రైలు ప్రయాణికులు త్వరితగతిన తమ గమ్యస్థానాలకు చేరవేసేందుకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 10 వందే భారత్ రైళ్లను మోడీ ప్రారంభించారు. అహ్మదాబాద్- ముంబై సెంట్రల్ మధ్య రైలు సహా 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు.
దేశంలోని రైలు ప్రయాణికులు త్వరితగతిన తమ గమ్యస్థానాలకు చేరవేసేందుకు వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 10 వందే భారత్ రైళ్లను మోడీ ప్రారంభించారు. అహ్మదాబాద్- ముంబై సెంట్రల్ మధ్య రైలు సహా 10 కొత్త వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. ఇది దేశంలో రైల్వే మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీకి దోహదపడుతుంది. కొత్త 10 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించడంతో మొత్తం వాటి సంఖ్య 50 కి పైగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా 45 రూట్లను కవర్ చేస్తుంది. ప్రస్తుతం, భారతీయ రైల్వే దాదాపు 41 వందే భారత్ ఎక్స్ ప్రెస్ నడుపుతుంది. ఈ రైళ్ల సేవలు 24 రాష్ట్రాలు.. 256 జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
మంగళవారం ప్రారంభించిన మొత్తం 10 కొత్త రైళ్లలో ఢిల్లీ-కత్రా, ఢిల్లీ-వారణాసి, ముంబై-అహ్మదాబాద్, మైసూర్-చెన్నై, కాసర్గోడ్-తిరువనంతపురం, ఇప్పుడు విశాఖపట్నం-సికింద్రాబాద్ సహా ఆరు మార్గాల్లో రెండు వందే భారత్ రైళ్లు నడుస్తాయి. ప్రధాని మోడీ 2023 డిసెంబర్లో ఆరు అదనపు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. ఈ రైళ్లలో కత్రా నుండి న్యూఢిల్లీని కలిపే రెండవ రైలు ఉంది. అమృత్సర్ నుండి ఢిల్లీ, కోయంబత్తూరు నుండి బెంగళూరు, మంగళూరు నుండి మడ్గావ్, జల్నా నుండి ముంబై, అయోధ్య నుండి ఢిల్లీ వరకు ఇతర వందేభారత్ మార్గాలు ఉన్నాయి.
10 వందే భారత్ రైళ్లు నడిచే మార్గాలివే
అహ్మదాబాద్-ముంబై సెంట్రల్
సికింద్రాబాద్-విశాఖపట్నం
మైసూరు- డాక్టర్ ఎంజీఆర్ సెంట్రల్ (చెన్నై)
పాట్నా- లక్నో
న్యూ జల్పాయిగురి-పాట్నా
పూరీ-విశాఖపట్నం
లక్నో – డెహ్రాడూన్
కలబురగి – సర్ ఎం విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు
రాంచీ-వారణాసి
ఖజురహో- ఢిల్లీ (నిజాముద్దీన్)
మరోవైపు.. కొత్తవలస-కోరాపుట్,.. కోరాపుట్-రాయగఢ్ లైన్లలో రెండు డబ్లింగ్ ప్రాజెక్టులు, విజయనగరం-టిట్లాగఢ్ థర్డ్ లైన్ ప్రాజెక్ట్‌లో కొన్ని పనులు ప్రారంభించారు మోదీ. మొత్తం 85వేల కోట్ల విలువైన కొన్ని కొత్త ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 9 కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్లు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లు వర్చువల్‌గా ప్రారంభించారు ప్రధాని. 14 మార్గాల్లో రైల్వే లైన్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు.