Accident: పెళ్లికి హాజరై ఇంటికి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం..

Road Accident: ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు.

Accident: పెళ్లికి హాజరై ఇంటికి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం..
Accident

Updated on: Jun 26, 2023 | 9:57 AM

Road Accident: ఒడిషాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. పలువురు గాయపడ్డారు. ఒడిశాలోని గంజాం జిల్లా దిగపహండి పరిధిలో రెండు బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పదిమంది మరణించగా.. 8మందికి తీవ్రగాయాలైనట్లు గంజాం పోలీసులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం MKCG మెడికల్ కాలేజీకి తరలించినట్లు గంజాం జిల్లా మేజిస్ట్రేట్ దిబ్యా జ్యోతి పరిదా తెలిపారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతుందని తెలిపారు. క్షతగాత్రులకు అన్ని విధాలా సహాయం అందించేందుకు, మెరుగైన చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టామని దిబ్యా జ్యోతి పరిదా చెప్పారు.

సీఎం నవీన్‌ పట్నాయక్‌ దిగ్భ్రాంతి..

దిగపహండి రోడ్డు ప్రమాదంపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతోపాటు.. రూ.3లక్షల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

బ్రహ్మపురలో జరిగిన వివాహానికి హాజరై బస్సులో ఇంటికి తిరిగి వస్తుండగా.. బ్రహ్మపుర-తప్తపాణి రోడ్డులో బస్సు మరో బస్సును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. అయితే, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..