అర్ధరాత్రి మహారాష్ట్రలో వరుస భూకంపాలు వణికించాయి. పాల్ఘర్ జిల్లా ప్రజలు భయందోళనలకు గురయ్యారు. తెల్లవారుజామున కేవలం 12 నిమిషాల వ్యవధిలో నాలుగు సార్లు భూమి కంపించింది. మొదట తెల్లవారుజామున 1.03 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై 3.8గా నమోదైంది. ఆ తర్వాత 1.15 గంటల వరకు 3.6, 2.9, 2.8 తీవ్రతతో మరో మూడు సార్లు భూమి కంపించింది.
జిల్లాలోని దహను కేంద్రంగా ఈ భూకంపాలు సంభవించాయి. వరుసగా భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా, భూకంప తీవ్రతకు దహను ప్రాంతంలో ఓ ఇంటి గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఓ 55ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
మరోవైపు భారీవర్షాలతో అతలాకుతలమైన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని చాంబా వద్ద సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూప్రకంపనలతో స్థానికులు ఒక్కసారిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.