రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా.. కోయంబత్తూరు విమానాశ్రయంలో భారీగా పట్టుబడిన డ్రగ్స్..
స్మగ్లింగ్ కట్టడికి అధికారులు ఎన్ని కట్టుదిట్టిమైన చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లింగ్ మాఫియా మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మరింత రెచ్చిపోయి నిరంతరం ప్లాన్స్ మారుస్తూ..
స్మగ్లింగ్ కట్టడికి అధికారులు ఎన్ని కట్టుదిట్టిమైన చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లింగ్ మాఫియా మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. మరింత రెచ్చిపోయి నిరంతరం ప్లాన్స్ మారుస్తూ వివిధ రూపాల్లో నిషేధిత వస్తులను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా కోయంబత్తూరు విమానాశ్రయంలో భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. నాగరత్నం(44) అనే ప్రయాణికుడు కోయంబత్తూర్ నుండి షార్జా వెళుతున్నాడు. అతని ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు అతన్ని తనిఖీలు చేశారు. నాగరత్నం వద్ద భారీగా డ్రగ్స్ గుర్తించారు. అతని నుండి సుమారు 1.2 కేజీలు ఉన్న ఫస్ట్ గ్రేడ్ మేథంఫెటమిన్ డ్రగ్స్‌ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ మార్కెట్‌లో దీని విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, తిరుచ్చికి చెందిన నాగరత్నంను అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. డ్రగ్స్ సరఫరాపై అతన్ని విచారిస్తున్నారు.