రూ.3.5 కోట్ల జీఎస్టీ ఎగవేత.. అరెస్ట్ చేయడానికి వెళ్లి బిత్తరపోయిన పోలీసులు.. అసలేం జరిగిందని ఆరా తీయగా..

రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి అతనిది.. రోజువారీ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ.. ఉన్నంతలో జీవితమనే జట్కా బండిని సంతోషంగా లాగించేస్తున్నాడు.

రూ.3.5 కోట్ల జీఎస్టీ ఎగవేత.. అరెస్ట్ చేయడానికి వెళ్లి బిత్తరపోయిన పోలీసులు.. అసలేం జరిగిందని ఆరా తీయగా..
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 06, 2020 | 7:47 AM

రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి అతనిది.. రోజువారీ కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ.. ఉన్నంతలో జీవితమనే జట్కా బండిని సంతోషంగా లాగించేస్తున్నాడు. ఇంతలో అతనికి దిమ్మతిరిగే నోటీసులు అందాయి. ఆ నోటీసులోని సారాంశం తెలుసుకుని షాక్‌కు గురయ్యాడు. ఇంతకీ ఆ నోటీసుల్లో ఏముందో తెలిస్తే మీరూ షాక్ అవుతారు. ఆ రోజువారి కూలీకి ‘రూ.3.5 కోట్ల జీఎస్టీ ఎగవేసినందుకు నీపై కేసు నమోదు చేశాం. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం.’ ఇదీ ఆ నోటీసు కథ. ఇది చూసిన ఆ వ్యక్తి మూడుపూటలా తినేందుకే తిప్పలు పడుతున్నాంరా దేవుడా అంటే.. ఈ జీఎస్టీ ఏంటి అని బిత్తరపోయాడు. అతనే కాదు.. ఈ నోటీసుల ప్రకారం సదరు వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసుల పరిస్థితి కూడా అదేనట. ఆ కూలీని చూసి పోలీసులు సైతం కంగుతిన్నారట. ఈ ఆసక్తికర ఘటన జార్ఖండ్‌లో రాయ్‌పహారీ గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళితే.. లాదున్ ముర్ము మేనేజింగ్ డైరెక్టర్‌గా అతని పేరిట ఎంఎస్ స్టీల్ కంసెనీ ఉంది. ఆ స్టీల్ కంపెనీ రూ.3.5 కోట్ల జీఎస్టీ ఎగవేసిందని, ఆ మేరకు జార్ఖండ్ స్టేట్‌ జీఎస్టీ డిపార్ట్‌మెంట్‌ ముర్ముపై కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా పోలీసులు లాదున్‌ ముర్మును అరెస్ట్ చేయడానికి వెళ్లారు. అక్కడ లాదున్ ముర్మును, అతని ఇంటిని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అసలేం జరిగిందని ఆరా తీయగా.. లాదున్ పేరిట ఎవరో నకిలీ కంపెనీ ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ తరువాత అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.

అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
అక్కినేని ముగ్గురు హీరోలను ఈ ఒక్క హీరోయిన్ కవర్ చేసిందా.!
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
ఈ లావాదేవీలకు ఆదాయపు పన్ను శాఖ నోటీసు పంపుతుందా?
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
హైకోర్టులో క్లర్క్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
సికింద్రాబాద్ ​నుంచి కుంభమేళాకు IRCTC ప్యాకేజీ.. వివరాలు ఏమిటంటే
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
ఓటీటీలో అద్దిరిపోయే సర్వైవల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
దక్షిణాది నుంచి బీజేపీలో కీలక నేతగా కిషన్ రెడ్డి
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌.. PF ATM కార్డ్‌, యాప్‌!
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఆ స్టార్ డైరెక్టర్ వల్లే నా కెరీర్ డ్యామేజ్ అయ్యింది..
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. 9 మంది జవాన్లు మృతి..!
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు
విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్‌ దరఖాస్తు గడువు పెంపు