ఏటా 10 రోజులు ‘నో స్కూల్‌ బ్యాగ్ డే’ అమలు చెయ్యండి, రాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులకు కేంద్రం లేఖ

అకడమిక్ ఇయర్‌లో కనీసం పది రోజులు.. స్కూల్ బ్యాగ్ లేకుండా పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా.. 'నో స్కూల్‌ బ్యాగ్ డే' అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది.

  • Ram Naramaneni
  • Publish Date - 9:03 am, Sun, 6 December 20
ఏటా 10 రోజులు 'నో స్కూల్‌ బ్యాగ్ డే' అమలు చెయ్యండి, రాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులకు కేంద్రం లేఖ

అకడమిక్ ఇయర్‌లో కనీసం పది రోజులు.. స్కూల్ బ్యాగ్ లేకుండా పాఠశాలలకు విద్యార్థులు వచ్చేలా.. ‘నో స్కూల్‌ బ్యాగ్ డే’ అమలు చేయాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. బడి సంచి బరువు తక్కువగా ఉండాలని.. నూతన స్కూల్​ బ్యాగ్​ విధానం-2020ని కేంద్ర విద్యాశాఖ తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో దాని అమలుకు చర్యలు తీసుకుని నివేదిక పంపాలని అన్ని రాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులకు తాజాగా లేఖలు రాసింది.

‘నో స్కూల్ బ్యాగ్‌ డే’ రోజుల్లో విద్యార్థులకు క్విజ్‌, ఆటలు, పాటల పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం సూచించింది. ప్రతి మూడు నెలలకొకసారి బడిసంచులు తూకం వేసేందుకు వీలుగా పాఠశాలల్లో డిజిటల్ తూకం మెషీన్స్ సమకూర్చుకోవాలని తెలిపింది.  ‘1, 2 తరగతులకు ఒకే నోట్‌బుక్‌ ఉండాలని… విద్యార్థులు పలచగా ఉండే పేపర్స్‌తో కూడిన పుస్తకాలు వాడాలని పేర్కొంది. అవసరం లేని వస్తువులు పంపవద్దని తల్లిదండ్రులుకు చెప్పాలని సూచించింది. సంచి బరువుపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొంది.

Also Read :

గ్రేటర్‌లో కాషాయం రెపరెపలు..ఏపీ నేతల్లో ఉత్సాహాం, తిరుపతి ఉపఎన్నికపై ఫోకస్ !

మంచిర్యాల జిల్లా వాసులకు పులి భయం, పొలం పనులకు వెళ్లాలంటే టెన్షన్..టెన్షన్