ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు: ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ అదుర్స్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి.. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ట్రైలర్ టాక్: కొద్దిసేపటి క్రితమే.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో.. అజయ్ కృష్ణగా మహేష్ కనిపించాడు. ‘మీరెవరో మాకు తెలీదు.. మీకు మాకూ ఏ రక్త సంబంధమూ లేదు. కానీ మీకోసం.. మీ పిల్లల […]

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా వస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రానికి.. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా.. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ట్రైలర్ టాక్: కొద్దిసేపటి క్రితమే.. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో.. అజయ్ కృష్ణగా మహేష్ కనిపించాడు. ‘మీరెవరో మాకు తెలీదు.. మీకు మాకూ ఏ రక్త సంబంధమూ లేదు. కానీ మీకోసం.. మీ పిల్లల కోసం.. మేము పోరాడుతూనే.. ఉంటాం. ఎందుకంటే మీరు మా బాధ్యత’ అంటూ.. ట్రైలర్‌లో మొదటిగా.. మహేష్ చెప్పే డైలాగ్స్ సూపర్బ్‌గా అనిపిస్తాయి. ఇక అలాగే.. ఆర్మీ ఆఫీసర్ పాత్రలో.. మహేష్.. మంచి లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత.. ఒక్కోక్క క్యారెక్టర్‌ని ట్రైలర్‌లో చూపిస్తూ.. బ్యాంగ్ గ్రౌండ్ వచ్చే డైలాగ్స్ ఆసక్తిగా నిలిచాయి. ఇక ఈ ట్రైలర్‌లో.. విజయశాంతి పవర్ ఫుల్ లుక్స్‌తో గంభీర్యంగా కనిపిస్తుంది. ఇక ట్రైలర్ చివరలో.. ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ హైలెట్‌గా అనిపిస్తుంది.
‘ప్రతీ సంక్రాంతికి అల్లుళ్లులు వస్తారు.. కానీ ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు అనే డైలాగ్’.. నవ్వులు తెప్పిస్తున్నాయి. కాగా.. ఈ చిత్రంలో మరికొన్ని ముఖ్య పాత్రలలో రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, సంగీత, బండ్ల గణేష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Anddddd it’s the fastest 100K liked teaser ? Rampage begins ?? https://t.co/UXLz0eEMku
Superstar @urstrulyMahesh @AnilRavipudi @AnilSunkara1 @RathnaveluDop @ThisIsDSP @AKentsOfficial @GMBents @SVC_official #SarileruNeekevvaru
— Anil Sunkara (@AnilSunkara1) November 22, 2019