Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జార్జ్ రెడ్డిని చంపిందెవరు?

జార్జ్ రెడ్డిని చంపింది ఎవరు? హూ కిల్డ్ జార్జ్ రెడ్డి..? గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని గోడలపై ఈ ప్రశ్నే కనిపిస్తూ వచ్చింది.. సినిమా ప్రమోషన్స్‌ని ఇలా వెరైటీగా ప్లాన్ చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రమోషన్ మాట అటుంచితే, నిజానికి జార్జ్ రెడ్డి సినిమా సారంశం కూడా అదే. జార్జిరెడ్డిని చంపింది ఎవరు? భయానికే వణుకు పుట్టించిన వీరుడు, చావుకు ఎదురువెళ్లి పోరాడే యోధుడు.. మైండ్, బాడీ రెండూ కలిగిన బలమైన మేధావి జార్జ్ రెడ్డి..అపారమైన తెలివి, […]

జార్జ్ రెడ్డిని చంపిందెవరు?
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Nov 22, 2019 | 3:54 PM

జార్జ్ రెడ్డిని చంపింది ఎవరు? హూ కిల్డ్ జార్జ్ రెడ్డి..? గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని గోడలపై ఈ ప్రశ్నే కనిపిస్తూ వచ్చింది.. సినిమా ప్రమోషన్స్‌ని ఇలా వెరైటీగా ప్లాన్ చేసారు చిత్ర యూనిట్ సభ్యులు. ప్రమోషన్ మాట అటుంచితే, నిజానికి జార్జ్ రెడ్డి సినిమా సారంశం కూడా అదే. జార్జిరెడ్డిని చంపింది ఎవరు?

భయానికే వణుకు పుట్టించిన వీరుడు, చావుకు ఎదురువెళ్లి పోరాడే యోధుడు.. మైండ్, బాడీ రెండూ కలిగిన బలమైన మేధావి జార్జ్ రెడ్డి..అపారమైన తెలివి, అంతకుమించిన ఫాలోయింగ్..ఇన్నింటినీ దాటుకొని జార్జ్‌ని చంపిందెవరు? వాళ్లు ఆ తరువాత ఏమయ్యారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

జార్జ్ రెడ్డి తనను వ్యతిరేకిస్తున్న విద్యార్థి సంఘాల బెదిరింపులను ఎప్పుడూ పట్టించుకోలేదు. అతను మరణానికి కూడా ఎప్పుడూ భయపడలేదు, ఎంతో మంది గూండాలను ఒంటరిగా తరమికొట్టాడు.. అతని మరణానికి రెండు నెలల ముందు, అంటే 1972 ఫిబ్రవరిలో హైదరాబాద్ డిడి కాలనీలోని తన ఇంటి దగ్గర గూండాలు దాడి చేశారు. అతను ప్రతిఘటించి గాయాల పాలయ్యాడు..జార్జ్ ను ఒంటరిగా తిరగొద్దంటూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. కానీ మరణం తనకు అంత తొందరగా రాదని జార్జ్ చెప్పేవాడంటారు. అయితే పక్కాగా ప్లాన్ చేసి, చుట్టు ముట్టి జార్జ్‌ని అంతమొందించారు కొందరు. తనకు ఎంతో ఇష్టమైన కాలేజ్ క్యాంపస్‌లోనే 1972 ఏప్రిల్ 14న… 25 సంవత్సరాల వయసులో దారుణ హత్యకు గురయ్యాడు.

ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 60కి మించి కత్తిపోట్లను పొడిచి కొన ఊపిరి తీశారంటే జార్జంటే వాళ్లకి ఎంత కోపమో, భయమో అర్థం చేసుకోవచ్చు. అయితే, జార్జ్ హత్య కేసులో మొత్తంగా 9 మందిపైన ఛార్జ్ షీట్స్ దాఖలయ్యాయి.. అందులో ఆరుగురికి ఏబీవీపీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. వారు ఆరు నెలల పాటు జైలు శిక్షను అనుభవించారు. వీళ్లను విడుదల చేసే రోజున NSUI ఆధ్వర్యంలో క్యాంపస్‌లో భారీ ప్రదర్శన కొనసాగింది. కోర్టుల వల్ల ఏదీ కాదు, మేమే వారికి శిక్షను విధిస్తామంటూ నినాదాలు చేసారు స్టూడెంట్స్.

దీంతో ప్రభుత్వం హైకోర్ట్‌లో అప్పీలు చేయగా, హైకోర్టు కూడా కింది కోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో ఆ తొమ్మిదిమందిలో ఎక్కువ శాతం నిర్ధోషులుగానే బయట పడ్డారు. జార్జ్‌ను చంపిన వారెవ్వరూ దానికి తగిన శిక్షను అనుభవించలేదంటూ చాలామంది విద్యార్ధులు, విద్యార్థి నాయకులు ఆరోపించారు. తాజాగా విడుదలైన జార్జిరెడ్డి బయోపిక్‌లోనూ జార్జ్‌ను ఎందుకు చంపారు, ఎవరు చంపారు అన్న విషయాలను డీప్‌గా చర్చించలేదు. దానికి బదులుగా, జార్జ్ ఎలాంటివాడు, జార్జ్ ఎలాంటి ఆలోచనశైలి ఎలా ఉండేది అనేది ఎక్కువగా ప్రస్తావించారు.. జార్జ్ చావు కంటే జార్జ్ జీవించిన విధానాన్ని ఆ మూవీలో ఫోకస్ చేసారు.