AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్యధికంగా యవకులు మానసిక ఆందోళనకు గురవుతున్నారా..?

ఒత్తిడి లేని జీవితం ఎవరికీ ఉండదు.. ఏ వయసులో వారైనా.. ఎవరైనా.. ఒత్తిడికి గురవని మానవుడు లేడనే చెప్పాలి. అయితే.. అత్యధికంగా యువకులు మానసికి ఆందోళనకు గురవుతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి కొన్ని పరిశోధనలు. బోర్న్ ఈవే ఫౌండేషన్ తరపున పరిశోధన బృందం రూపొందించిన ఈ నివేదిక అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దాదాపు 2వేల మందిపై పరిశోధనలు నిర్వహించారు. 13 నుంచి 24 సంవత్సరాల వయసులో ఉన్న వారిపై పరిశోధనలు చేయగా అందులో దాదాపు 60శాతం మంది […]

అత్యధికంగా యవకులు మానసిక ఆందోళనకు గురవుతున్నారా..?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 12, 2019 | 2:43 PM

Share

ఒత్తిడి లేని జీవితం ఎవరికీ ఉండదు.. ఏ వయసులో వారైనా.. ఎవరైనా.. ఒత్తిడికి గురవని మానవుడు లేడనే చెప్పాలి. అయితే.. అత్యధికంగా యువకులు మానసికి ఆందోళనకు గురవుతున్నారా..? అంటే అవుననే అంటున్నాయి కొన్ని పరిశోధనలు. బోర్న్ ఈవే ఫౌండేషన్ తరపున పరిశోధన బృందం రూపొందించిన ఈ నివేదిక అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో దాదాపు 2వేల మందిపై పరిశోధనలు నిర్వహించారు. 13 నుంచి 24 సంవత్సరాల వయసులో ఉన్న వారిపై పరిశోధనలు చేయగా అందులో దాదాపు 60శాతం మంది ఒత్తిడిని ఫీలవుతున్నాము అన్నారు. ఒక 40 శాతం మంది మాత్రమే స్థిరంగా ఉన్నారని వెల్లడించారు.

లేడీ గాగా యొక్క జాతీయ సర్వే ప్రకారం 10 మందిలో 9 మంది మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. చాలా మంది వారి ఉద్యోగాలు, ఇంటి సమస్యల విషయంలో చాలా ఇబ్బందులుకు గురవుతున్నారని అందుకే మానసిక ఆందోళన చెందుతున్నామని పేర్కొంటున్నారు. అందులోనూ యువకులు వాళ్ల తల్లిదండ్రుల విషయంలో ఎక్కువ ఆందోళనకు చెందుతున్నట్లు వెల్లడిస్తున్నారు. అలాగే వారి చుట్టూ ఉండే సమాజం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తున్నదని అన్నారు. యవకులు ఆందోళన చెందే విషయం వారి తల్లిదండ్రులకు వెల్లడించడంలేదని.. పరిశోధనలో తెలిపారు. అలాగే.. చదువు విషయంలో కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నరని చెప్పారు.

ఒత్తిడికి ప్రధానమైన కారణాలు :

నిద్రపోవడంలో ఇబ్బందులు, ఆకలి లేకపోవడం, ఏకాగ్రత లోపించడం, జ్ఞాపకముంచుకోవడంలో ఇబ్బంది, పనితనంలోనూ, సామర్ధ్యంలోనూ తరుగుదల, విశేషంలేని, అసామాన్యమైన పొరపాట్లు, తప్పులు లేక స్వయంగా విధించుకున్న హద్దులను, ఆంక్షలను పాటించకపోవడం, నిలబెట్టుకోలేకపోవడం. కోపం, హింసాత్మక లేక సంఘవ్యతిరేక ప్రవర్తన, మానసిక సంఘర్షణ, ఒక్కసారిగా రెచ్చిపోవడం, మత్తుపానీయాలు లేక మాదకద్రవ్యాల దుర్వినియోగం, నరాల బలహీనత లేక అధైర్యంగా ఉండే అలవాట్లు.. ప్రధానమైనవిగా పేర్కొన్నారని పరిశోధకులు తెలిపారు.

వీటి నుంచి బయటపడాలంటే ప్రస్తుతమున్న పరిసరాలు, అలవాట్లు మార్చుకోవాలి. అలాగే ప్రత్యేకమైన కౌన్సిలింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. వీలైనంతవరకూ మన ఆందోళనను మనకు దగ్గరి వ్యక్తులతో పంచుకునేందుకు ట్రై చేయాలి. మీకు నచ్చని పని ఏదైనా ఉంటే దానికి వెంటనే దూరంగా ఉండటం వల్ల కొంత ఉపశమనం ఉంటుందని మానసిక నిపుణులు తెలిపారు.