
అధిక రక్తపోటును హై బీపీ అని కూడా అంటారు. అధిక రక్తపోటు అనేది శరీర ధమనులను ప్రభావితం చేసే ఒక సాధారణ పరిస్థితి. దీనిని హైపర్‌టెన్షన్ అని కూడా అంటారు. ప్రతి సంవత్సరం మే 17న అధిక రక్తపోటు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఒత్తిడి రక్తపోటును పెంచుతుంది అయితే అది నేరుగా రక్తపోటుకు కారణం కాదు. ఒత్తిడి సమయంలో, శరీరం అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది గుండె వేగంగా కొట్టుకోవడానికి, రక్త నాళాలు కుంచించుకుపోవడానికి కారణమవుతుంది. దీనివల్ల తాత్కాలికంగా రక్తపోటు పెరుగుతుంది. అయితే కొన్ని యోగా ఆసనాలను క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల ఒత్తిడిని తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనాలు శరీరానికి విశ్రాంతినిస్తాయి. మానసికంగా ప్రశాంతతని ఇస్తాయి. ఒత్తిడి నుంచి ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ఈ రోజు మానసిక ఒత్తిడి నియంత్రించే కొన్ని యోగాసనాల గురించి తెలుసుకుందాం..
ఈ ఆసనం మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది వీపు, భుజం , మెడ ఉద్రిక్తతను కూడా తగ్గిస్తుంది. బాలసన ఆసనం ఒత్తిడిని తగ్గించడంలో, శరీరమంతా రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
శవాసనం శరీరానికి, మనసుకు పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. ఒత్తిడి, ఆందోళన , అలసట నుంచి ఉపశమనం ఇచ్చేందుకు ఇది అత్యంత ప్రభావవంతమైన ఆసనంగా పరిగణించబడుతుంది. శవాసన సాధన ఒత్తిడిని తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
ఈ సేతుబంధాసనం హార్మోన్ల సమతుల్యతకు తోడ్పడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. తలనొప్పిని తగ్గిస్తుంది. సేతుబంధాసన సాధన అధిక రక్తపోటు, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.
ఈ ఆసనం వెనుక కండరాలను బలోపేతం చేస్తుంది. ఛాతీని తెరవడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
యోగాలో ప్రాణాయామం మనస్సు ప్రశాంతంగా ఉంచటానికి సహాయపడతాయి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)