
మూత్రపిండాలు రక్తంలో చేరే కల్మషాన్ని గాలించి, వడపోసి, శుభ్రం చేసే విధులను నిర్వహిస్తాయి. దీని కారణంగా శరీరంలో పోషకాలు గ్రహించబడతాయి. శరీరం నుంచి వ్యర్థాలు తొలగించబడతాయి. శరీరంలోని ఖనిజాలు, నీరు మొదలైన వాటి సమతుల్యతను కాపాడుకోవడానికి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడం చాలా ముఖ్యం. చాలా మంది ఉప్పు ఎక్కువగా తినడం లేదా ధూమపానం, మద్యం తాగడం మూత్రపిండాలకు హానికరం అని అనుకుంటారు. అయితే మనకు ఆరోగ్యంగా అనిపించే అనేక పదార్ధాలు ఉన్నాయి. వీటిని ఎక్కువ మొత్తంలో వినియోగిస్తే మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతుంటే తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 13న జరుపుకుంటారు. కిడ్నీ సంబంధిత వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. అధిక సోడియం కలిగిన ఆహారాలు, కార్బోనేటేడ్ పానీయాలు, ప్రాసెస్ చేసిన మాంసం మొదలైనవి మూత్రపిండాలతో సహా మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. అంతేకాదు మీరు ఆరోగ్యకరమైనవిగా భావించి తినే కొన్ని ఆహార పదార్ధాలున్నాయి. అయితే అవి మీ మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి. ఆ ఆహార పదార్ధాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..
పాలు, పాల ఉత్పత్తులైన జున్ను, వెన్న మొదలైనవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. అయితే ఎక్కువ మొత్తంలో కొవ్వు ఉన్న పాలు, పాల ఉత్పత్తులను అధికంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై అదనపు ఒత్తిడి ఏర్పడుతుంది. వాటి పనితీరును ప్రభావితం చేస్తుంది.
చాలా మందికి నాన్-వెజ్ అంటే చాలా ఇష్టం. అదే సమయంలో ప్రజలు నాన్ వెజ్ ను ప్రోటీన్ కలిగి ఉన్న అద్భుతమైన ఆహారం అని భావిస్తారు. అయితే ప్రోటీన్‌తో పాటు, రెడ్ మీట్ లో కూడా అధిక మొత్తంలో కొవ్వు ఉంది. ఇది మూత్రపిండాలకు గొప్ప హాని కలిగిస్తుంది. అదే సమయంలో శరీరంలో అధిక మొత్తంలో ప్రోటీన్ చేరితే యూరిక్ యాసిడ్ సమస్యకు కారణమవుతుంది. నిజానికి అధిక ప్రోటీన్, కొవ్వు ఉన్నప్పుడు.. మూత్రపిండాలు విషాన్ని సరిగ్గా తొలగించలేవు. దీని కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇది మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు.
చాలా మంది మార్కెట్ లో లభించే క్యాన్డ్ ఫ్రూట్ జ్యూస్‌లు, వేరుశెనగ వెన్న వంటి ఆరోగ్యకరమైన వస్తువులను కొని తింటారు. అయితే వీటిలో అధిక మొత్తంలో ప్రిజర్వేటివ్‌లు అలాగే చక్కెర, సోడియం, నూనె మొదలైనవి ఉంటాయి. ఇవి మీ మూత్రపిండాలకు హాని కలిగిస్తాయి.
కండరాల బలం కోసం చాలా మంది ప్రోటీన్ పౌడర్ తీసుకుంటారు. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాన్ని కూడా తింటారు. అయితే ఈ ప్రోటీన్ పౌడర్ కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి మంచిది కాదు. శరీరానికి రోజువారీ అవసరం అయినంత మేరకు మాత్రమే ప్రోటీన్ తీసుకోవాలి. కనుక ప్రోటీన్ పౌడర్ ను రోజూ ఉపయోగించే వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
టీ, కాఫీ వంటి కెఫిన్ ఉన్న వాటిని తీసుకోవడం, అరటిపండు ఎక్కువగా తినడం, టమోటాలు ఎక్కువగా తినడం లేదా బంగాళాదుంపలు ఎక్కువగా తినడం వల్ల కూడా మూత్రపిండాలకు హాని కలుగుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, పుష్కలంగా నీరు త్రాగడం మంచిది. అయితే ఎక్కువ నీరు త్రాగడం వల్ల కూడా మూత్రపిండాలకు హాని కలుగుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..