
Pregnancy Acne and Pimples: గర్భధారణ సమయంలో.. చాలా మంది మహిళల ముఖం నీరసంగా, నిర్జీవంగా, పొడిగా కనిపిస్తుంది. గర్భధారణ సమయంలో హార్మోన్ల మార్పుల వల్ల ముఖంపై మొటిమల సమస్య పెరుగుతుంది. కానీ, ఈ వంటింటి చిట్కాలతో మొహంపై మొటిమలు, కురుపుల సమస్యకు చెక్ పెట్టొచ్చు. గర్భం అనేది ఏ స్త్రీకైనా ప్రత్యేకమైన క్షణం. అయితే, గర్భం కారణంగా మహిళలు మొటిమలు, కురుపులు వంటి సమస్యను ఎదుర్కొంటుంటారు. గర్భం ప్రభావం స్త్రీ ముఖంపై కనిపిస్తుంది. ఈ సమయంలో ముఖం కూడా డల్, డ్రైగా కనిపిస్తుంది. నిర్జీవ చర్మాన్ని నివారించడానికి, మహిళలు అనేక సౌందర్య సాధనాలను ఉపయోగిస్తారు. దీని వల్ల కొన్నిసార్లు చర్మం దెబ్బతింటుంది. గర్భధారణ సమయంలో శుభ్రమైన, మచ్చలేని ముఖం పొందడానికి.. కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్‌ని అనుసరించవచ్చు. గర్భధారణ సమయంలో మొటిమలు, మచ్చల సమస్యలను ఎలా వదిలించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
యాపిల్ సైడర్ వెనిగర్‌ని రెగ్యులర్‌గా ఉపయోగిస్తే మొటిమల సమస్య చాలా వరకు దూరమవుతుంది. ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్‌ను సమాన మొత్తంలో నీటితో కలపండి. ఆ తర్వాత మీ ముఖానికి అప్లై చేయండి. కాసేపు అలాగే ఉంచి.. ఆ తరువాత మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. రెగ్యూలర్ గా ఇలా చేయడం వలన కొద్ది రోజుల్లోనే మంచి ప్రభావాన్ని చూస్తారు.
బేకింగ్ సోడా కూడా మొటిమల సమస్యలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బేకింగ్ సోడాను నేరుగా చర్మంపై రాయకూడదు. ఇది చర్మానికి హాని కలిగించవచ్చు. బేకింగ్ సోడాను నేరుగా అప్లై చేసే బదులు అందులో కొబ్బరినూనె కలపడం మంచిది.
నిమ్మకాయలో విటమిన్ సి మరియు అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. దీని రసాన్ని అప్లై చేయడం వల్ల రంధ్రాలు తెరుచుకుంటాయి. మీరు మీ చర్మంపై నిమ్మరసాన్ని ఉపయోగించినప్పుడు, అది మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. నిమ్మరసం తీసి కాటన్ బాల్ సహాయంతో మొటిమల ప్రదేశంలో అప్లై చేయండి. దీని తర్వాత మీ ముఖం కడగాలి.
తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి, ఇది చర్మానికి మేలు చేస్తుంది. దీని వల్ల మీ చర్మం తేమగా మారుతుంది. ఇది కాకుండా, మీరు స్పాట్ ట్రీట్మెంట్‌గా కూడా తేనెను ఉపయోగించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..