Bedsheets: టాయిలెట్‌ కంటే అధిక బ్యాక్టీరియా మీ ఇంట్లోని బెడ్‌ షీట్లపైనే.. ఇలా చేశారంటే ప్రాణాంతక వ్యాధులు తప్పవ్!

సాధారణంగా బెడ్ రూమ్ శుభ్రంగా, అందంగా ఉంటే మనం బాగా నిద్రపోవడమే కాకుండా, మన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కానీ కొందరు నెలల తరడబి బెడ్ షీట్లను ఉతకరు. దీనివల్ల ప్రాణాంతక వ్యాధులు సంక్రమిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలా అధికకాలం మురికి పట్టిన బెడ్ షీట్లను వాడటం వల్ల..

Bedsheets: టాయిలెట్‌ కంటే అధిక బ్యాక్టీరియా మీ ఇంట్లోని బెడ్‌ షీట్లపైనే.. ఇలా చేశారంటే ప్రాణాంతక వ్యాధులు తప్పవ్!
How Often You Should Wash Your Bed Sheets

Updated on: May 13, 2025 | 2:00 PM

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కూడా ఒక కళ. ఇది అందరికీ సాధ్యం కాదు. ఇంటి పని బోరింగ్‌గా ఉన్నప్పటికీ.. దానిని విస్మరించకూడదు. ఇటీవలి కాలంలో ఇంటి పనులను సులభతరం చేయడానికి వివిధ రకాల స్మార్ట్ పరికరాలు మార్కెట్లోకి వచ్చాయి. కాబట్టి వీటిని ఉపయోగించడం వల్ల ఇంటి పనులు మరింత సులభతరం చేసుకోవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొంతమంది ఇంటి శుభ్రతపై పెద్దగా శ్రద్ధ చూపరు. చాలా మంది తమ బెడ్‌రూమ్‌లలో నెలల తరబడి బెడ్‌షీట్‌లను మార్చకుండానే వాటిని ఉపయోగిస్తుంటారు. కానీ ఈ రకమైన అలవాటు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని మీకు తెలుసా ? అవును.. ఇది చిన్న విషయంగా మీకు అనిపించినప్పటికీ, దీనివల్ల కలిగే సమస్యలు చాలా ఉన్నాయి.

బెడ్ షీట్లు ఎక్కువ రోజులు మార్చకపోతే ఏమవుతుంది?

సాధారణంగా బెడ్ రూమ్ శుభ్రంగా, అందంగా ఉంటే మనం బాగా నిద్రపోవడమే కాకుండా, మన ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. కానీ నెలల తరబడి మంచం మీద ఉన్న బెడ్ షీట్లకు దుమ్ము, చెమట, లాలాజలం, చుండ్రు, చనిపోయిన చర్మ కణాలు అన్నీ అంటుకుని ఉంటాయి. దీనివల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మనం మన జీవితంలో మూడోవంతు సమయం మంచంపైనే గడుపుతాము. కాబట్టి ఇవి మురికిగా మారకముందే వేడి నీటిలో ఎప్పటికప్పుడు శుభ్రం చేయవాలి. టాయిలెట్ సీట్ల కంటే మురికి బెడ్ షీట్లలో ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుందని పరిశోధనలు సైతం చెబుతున్నాయి. అందువల్ల, బెడ్ షీట్లను కనీసం వారానికి ఒకసారి అయినా ఉతకాలి. లేకుంటే మురికి బెడ్ షీట్ల వల్ల మొటిమలు, అలెర్జీలు, ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి. ముఖ్యంగా దుమ్ము కణాలు గాలిలో కలిసిపోయి ఉబ్బసం లేదా శ్వాసకోశ సమస్యలను తీవ్రతరం చేస్తాయి. రాత్రంతా ఈ మురికి బెడ్‌లపై పడుకోవడం వల్ల శరీరంహానికరమైన సూక్ష్మజీవులకు గురవుతుంది. దీంతో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.

డ్రైవుడ్ బెడ్ షీట్‌తో నష్టాలు

మీ బెడ్ రూమ్ లోని బెడ్ షీట్లు మురికిగా ఉంటే అది మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. చెమట, నూనె వాసన మీ మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. నిద్రలేమి సమస్యలను కలిగిస్తుంది. శుభ్రమైన బెడ్ షీట్లు మీకు బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి. ఇది శరీరానికి విశ్రాంతిని కూడా ఇస్తుంది. మీకు అలెర్జీలు ఉంటే, బెడ్ షీట్లను క్రమం తప్పకుండా మార్చాలి. లేకపోతే అది మీ అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇది తుమ్ములు, జ్వరం, శ్వాసకోశ సమస్యలను కూడా పెంచుతుంది. కాబట్టి మీరు మీ బెడ్ షీట్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉతుక్కోవాలి. ముఖ్యంగా మీ ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే, పరుపును కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. లేకుంటే అది వివిధ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

ఇవి కూడా చదవండి

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించడం మర్చిపోవద్దు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.