AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పురుషుల కంటే మహిళలకే థైరాయిడ్ ముప్పు ఎక్కువ.. ఎందుకో తెలుసా? ఈ లక్షణాలను అస్సలు వదిలేయకండి!

ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో థైరాయిడ్ అనేది ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. కానీ, ఈ వ్యాధి బారిన పడుతున్న వారిలో పురుషుల కంటే మహిళల సంఖ్యే చాలా ఎక్కువగా ఉంటోంది. చాలా మంది దీనిని కేవలం అలసట లేదా బరువు పెరగడంగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ, థైరాయిడ్ మన శరీరంలోని అనేక ముఖ్యమైన విధులను ప్రభావితం చేస్తుంది. ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో ఏదో ఒక దశలో థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అసలు పురుషుల కంటే మహిళల్లోనే ఈ సమస్య ఎందుకు ఎక్కువగా కనిపిస్తుందో తెలుసుకుందాం.

పురుషుల కంటే మహిళలకే థైరాయిడ్ ముప్పు ఎక్కువ.. ఎందుకో తెలుసా? ఈ లక్షణాలను అస్సలు వదిలేయకండి!
Thyroid Disease In Women
Jyothi Gadda
|

Updated on: Jul 04, 2026 | 1:39 PM

Share

నేటి కాలంలో అత్యధికంగా వినిపించే ఆరోగ్య సమస్యలలో థైరాయిడ్ ఒకటి. అయితే, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పురుషులతో పోలిస్తే మహిళల్లో ఈ సమస్య వచ్చే అవకాశం 5 నుండి 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఒక అంచనా ప్రకారం, ప్రతి 8 మంది మహిళల్లో ఒకరు తమ జీవితకాలంలో థైరాయిడ్ బారిన పడుతున్నారు. హఠాత్తుగా బరువు పెరగడం లేదా తగ్గడం, తీవ్రమైన అలసట, జుట్టు రాలడం, క్రమరహిత పీరియడ్స్ వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే రక్త పరీక్షలు (TSH, T3, T4) చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ మహిళల్లో థైరాయిడ్ ముప్పు ఎక్కువగా ఉండటానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..

మన మెడ భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి శరీర జీవక్రియ (Metabolism) మరియు శక్తిని నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. మహిళల్లో ఈ సమస్య పెరగడానికి గల ప్రధాన కారణాలు:

ఆటోఇమ్యూన్ వ్యాధులు (Autoimmune Diseases): మహిళల రోగనిరోధక వ్యవస్థ (Immune System) పురుషుల కంటే భిన్నంగా పనిచేస్తుంది. కొన్నిసార్లు శరీర నిరోధక వ్యవస్థ పొరపాటున సొంత థైరాయిడ్ గ్రంథిపైనే దాడి చేస్తుంది. దీనివల్ల ‘హషిమోటోస్ థైరాయిడైటిస్’, ‘గ్రేవ్స్ డిసీజ్’ వంటి సమస్యలు వచ్చి హార్మోన్ల ఉత్పత్తి దెబ్బతింటుంది.

ఇవి కూడా చదవండి

జీవితంలో వచ్చే కీలక మార్పులు: మహిళల జీవితంలో గర్భధారణ (Pregnancy), ప్రసవం తర్వాత సమయం మరియు మెనోపాజ్ (ముట్లుడగడం) వంటి దశలలో శరీరంలో హార్మోన్లు చాలా వేగంగా మారుతుంటాయి. ఈ ఈస్ట్రోజెన్ హార్మోన్ల హెచ్చుతగ్గులు నేరుగా థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం చూపుతాయి.

నిర్లక్ష్యం చేయకూడని ముఖ్య లక్షణాలు:

థైరాయిడ్ గ్రంథి అవసరమైన దానికంటే తక్కువ హార్మోన్లను విడుదల చేస్తే హైపోథైరాయిడిజం, ఎక్కువ విడుదల చేస్తే హైపర్‌థైరాయిడిజం అంటారు. ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే అప్రమత్తం కావాలి:

ఎలాంటి కారణం లేకుండా విపరీతమైన అలసట, నీరసం రావడం.

అకస్మాత్తుగా బరువు పెరగడం లేదా వేగంగా బరువు తగ్గిపోవడం.

జుట్టు విపరీతంగా రాలడం, చర్మం పొడిబారడం.

పీరియడ్స్ (నెలసరి) క్రమం తప్పడం లేదా గర్భం దాల్చడంలో ఇబ్బందులు రావడం.

మూడ్ స్వింగ్స్ (తరచూ మూడ్ మారడం) మరియు మెడ భాగంలో వాపు కనిపించడం.

వయసు పైబడిన మహిళల్లో ఈ లక్షణాలు మెనోపాజ్ లాగే అనిపించడం వల్ల వ్యాధి గుర్తింపు ఆలస్యమవుతుంది. కాబట్టి ఇలాంటి మార్పులు గమనించినప్పుడు వైద్యుల సలహాతో TSH, T3, T4 వంటి సాధారణ రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా థైరాయిడ్‌ను సకాలంలో గుర్తించి, మందుల సహాయంతో పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us