AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉదయం లేదా రాత్రి.. ఎప్పుడు పళ్లు తోముకోవడం మంచిది.. తెలుసుకోకపోతే ఈ సమస్యలు ఖాయం..

నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే దంత సమస్యలు, చిగుళ్ల జబ్బులు, చివరికి నోటి క్యాన్సర్ వంటి పెద్ద ప్రమాదాలు కూడా రావచ్చు. అందుకే రోజుకు రెండు సార్లు పళ్లు తోముకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం కంటే రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేయడం చాలా అవసరం. ఎందుకు చేయాలి..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఉదయం లేదా రాత్రి.. ఎప్పుడు పళ్లు తోముకోవడం మంచిది.. తెలుసుకోకపోతే ఈ సమస్యలు ఖాయం..
Best Time To Brush Teeth
Krishna S
|

Updated on: Nov 05, 2025 | 7:15 AM

Share

శారీరక ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకున్నట్లే.. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. అయితే చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు. నోటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేస్తే అది అనేక రకాల దంత సమస్యలు, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, నోటి క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ పళ్లు తోముకోవడం తప్పనిసరి. చాలా మంది ఉదయం బ్రష్ చేసినా, ఎప్పుడు బ్రష్ చేయడం ఎక్కువ అవసరం..? అనే సందేహం ఉంటుంది. దీనిపై న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లోని దంత విభాగానికి చెందిన డాక్టర్ బందన పి. మెహతా ముఖ్యమైన సలహాలు ఇచ్చారు.

రాత్రిపూట బ్రష్ చేయడం ఎందుకుడ ముఖ్యం?

డాక్టర్ వందన మెహతా ప్రకారం.. ఉదయం బ్రష్ చేయడం మంచిదే అయినప్పటికీ, రాత్రిపూట బ్రష్ చేయడం ఇంకా చాలా ముఖ్యం. దీనికి కారణాలు ఇవే..

ఆహార కణాలు: మనం రోజంతా తిన్న తర్వాత ఆహారం యొక్క చిన్న కణాలు దంతాల మధ్య ఖాళీలలో చిక్కుకుపోతాయి.

లాలాజలం కొరత: రాత్రిపూట మనం నిద్రించే సమయంలో పగటిపూట కంటే తక్కువ లాలాజలం ఉత్పత్తి అవుతుంది. లాలాజలం నోటిని శుభ్రపరిచే సహజ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

బ్యాక్టీరియా వృద్ధి: లాలాజలం తక్కువగా ఉండటం వలన నోటిలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా ఆహార కణాలను ఆహారంగా తీసుకుని, రాత్రంతా దంతాలపై దాడి చేస్తుంది.

తీవ్ర నష్టం: రాత్రి భోజనం తర్వాత పళ్ళు తోముకోకపోతే ఈ బ్యాక్టీరియా దంతాల ఉపరితలం మొత్తాన్ని దెబ్బతీసి, దంతక్షయం, దుర్వాసన వంటి సమస్యలకు దారితీస్తుంది.

రాత్రిపూట బ్రష్ చేయడం వల్ల దంత క్షయం మాత్రమే కాకుండా చిగుళ్ల వాపు, దుర్వాసన కూడా నివారించవచ్చని నిపుణులు స్పష్టం చేశారు. అందువల్ల, మంచి నోటి ఆరోగ్యం కోసం ఈ అలవాటును వీలైనంత త్వరగా చేసుకోవడం చాలా మంచిది.

మంచి నోటి ఆరోగ్యానికి ముఖ్య చిట్కాలు..

  • మంచి నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ నియమాలు పాటించాలి:
  • తొందరపడకుండా, ప్రతిరోజూ కనీసం రెండు నిమిషాలు బ్రష్ చేయాలి.
  • తిన్న తర్వాత కనీసం అరగంట గ్యాప్ ఇచ్చి బ్రష్ చేసుకోవాలి.
  • మృదువైన బ్రిస్టల్స్ ఉన్న బ్రష్‌ను ఉపయోగించండి.

బ్రష్‌తో పాటు దంతాల మధ్య శుభ్రత కోసం ఫ్లాస్, నోటి పరిశుభ్రత కోసం మౌత్ వాష్‌లను కూడా ఉపయోగించవచ్చు.

నోటి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల నోటి పూతల నుండి నోటి క్యాన్సర్ వరకు అనేక వ్యాధుల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరించారు. అందుకే ప్రతి డ్రైవ్ రెండు నిమిషాలు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవడం తప్పనిసరి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..