Hairfall: దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా? అసలు కారణం ఇదేకావచ్చు! లైట్‌ తీసుకుంటే బట్టతలే!

ప్రస్తుత రోజుల్లో జనాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య జుట్టురాలడం. దువ్వినప్పుడూ, లేదా స్నానం చేసి తల తూడ్చుకున్నప్పుడూ ఇలా చాలా సార్లు జుట్టు రాలుతుంది. దీన్ని చూసి చాలా మంది ఆందోళన చెందుతూ ఉంటారు. ఇంతకూ ఇలా జుట్టు ఎందుకు రాలిపోతుంది. ఇందుకు కారణం ఏంటో మీరెప్పుడైనా ఆలోచించారా? అయితే ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

Hairfall: దువ్విన ప్రతిసారి జుట్టు రాలుతుందా? అసలు కారణం ఇదేకావచ్చు! లైట్‌ తీసుకుంటే బట్టతలే!
Reason Of Hair Fall

Updated on: Jan 21, 2026 | 3:44 PM

జుట్టు రాలడం అనేది చాలా మందిని బాధించే ఒక పెద్ద సమస్య. రోజూ దువ్వినప్పుడూ లేదా స్నానం చేసి తల తూడ్చుకున్నప్పుడూ జుట్టురాలుతూనే ఉంటుంది. ఇది చాలా మందిలో ఆందోళలనలను రేకెత్తిస్తుంది. ఇలా జుట్టు రాలే సమస్యకు కారణం తెలుసుకొని చికిత్స తీసుకోకపోతే సమస్య తీవ్రంగా మారవచ్చు. కాబట్టి ఇలా జుట్టు ఎందుకు రాలుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దానికి నివారణ చర్యలు చేపట్టడం కూడా అవసరం. చర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ గౌరవ్ గార్గ్‌ ప్రకారం మన జీవనశైలి, మనం తీసుకునే ఆహారం జుట్టుపై ప్రభాన్ని చూపుతుందని అంటున్నారు. జుట్టు రాలడం సర్వసాధారణం అయినప్పటికీ, మీరు దానిపై ఎక్కువ శ్రద్ధ చూపడం ముఖ్యమంటున్నారు.

జుట్టు ఎందుకు రాలుతుంది?

మనం జుట్టు దువ్వినప్పుడు లేదా స్నానం చేసినప్పుడూ ఇలా ఒక వ్యక్తికి రోజుకు 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోవడం సాధారణం. మన చర్మం చనిపోయిన కణాలను ఎలా అయితే తొలగిస్తుందో, తల చర్మం కూడా నిర్జీవంగా మారిన పాత వెంట్రుకలను అలానే తొలగిస్తుంది. మీరు ఎక్కువ ఒత్తిడికి లోనైనప్పుడూ జుట్టు రాలడం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనినే టెలోజెన్ ఎఫ్లూవియం అంటారు. అయితే ఇది రోజూ జరిగితే ప్రమాదమనే అని చెప్తున్నారు.

ఒక వ్యక్తికి అధిక జ్వరం వచ్చినప్పుడు, ప్రసవం తర్వాత లేదా బరువు తగ్గినప్పుడు, వారి శరీరం మరింత ఒత్తిడికి లోనవుతుంది. ఈ పరిస్థితులలో, జుట్టు రాలడం మరింత తీవ్రమవుతుంది. అయితే, దీనికి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ జుట్టు పెరగకుండా జుట్టు రాలడం జరిగితే మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో సరైన చికిత్స తీసుకోకపోతే మీకు బట్టతల వచ్చే అవకాశం ఉంది.

జుట్టు రాలడాన్ని నివారించడానికి ఏమి తినాలి?

జుట్టు రాలకుండా ఉండాలంటే మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు గుడ్లు తప్పనిసరిగా తినాలి. గుడ్డులోని పచ్చసొనలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది, కాబట్టి వీటిని తినడం వల్ల జుట్టు పెరుగుదలకు మంచిది. గుడ్లలో విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఉంటాయి. అలాగే పాలకూర, ఇందులో బయోటిన్ ఉంటుంది ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

అలానే పాలు, పాల ఉత్పత్తులు తినండం వల్ల కూడా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాలు, జున్ను, పెరుగు మొదలైన వాటిలో కాల్షియం, ప్రోటీన్, బయోటిన్ మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే కొవ్వు చేపలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. అలాగే మీరు బాదం, వేరుశెనగ, వాల్‌నట్, చియా గింజలు, అవిసె గింజలు, గుమ్మడికాయ గింజలు, పొద్దుతిరుగుడు విత్తనాల వంటి వాటిని కూడా తీసుకొవచ్చు. ఇందుకలో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.