
సీతాఫలం ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్లు, లవణాలు అధికంగా ఉండి, కొవ్వు ఏ మాత్రం ఉండదు. శీతాకాలం మొదలైతే అందరూ సీతాఫలం గురించే ఆలోచిస్తారు. ఈ సీజన్‌లో లభించే సీతాఫలం తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ, కొందరు మాత్రం సీతాఫలం అస్సలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎవరు సీతాఫలం తినకూడదు..? ఎందుకు అనే దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం..
ప్రస్తుతం చాలా మంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఈ మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారిలో ఎక్కువ మంది భారతదేశంలోనే ఉన్నారని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే భారతదేశాన్ని మధుమేహ రాజధాని అని కూడా పిలుస్తున్నారు. నేడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి డయాబెటిస్ పెద్ద సమస్యగా మారింది. మారుతున్న జీవనశైలి, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్లే డయాబెటిస్ వస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
సీతాఫలంలో యాంటీఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్లు సి, బి6, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారు అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లను తీసుకుంటారు. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పండ్లలో సీతాఫలం ఒకటి. ఈ పండులో ఫ్రక్టోజ్ ఉన్నందున మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇన్సులిన్ వాడని మధుమేహ రోగులు సీతాఫలాన్ని మితంగా తినవచ్చు. 15 రోజులకు ఒకసారి తినడం వల్ల వారి చక్కెర స్థాయిలు మారవు. అయితే, ఇన్సులిన్ తీసుకునే మధుమేహ రోగులు ఈ పండు తినడం వల్ల వారి చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ తీపి పండు తినడం వల్ల వారి చక్కెర స్థాయిలు పెరిగితే, వారు మళ్ళీ వారి ఇన్సులిన్ స్థాయిలను పెంచాల్సి ఉంటుంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు ఈ పండు తినకూడదని సలహా ఇస్తారు.
మధుమేహం ఉన్నవారు తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే మామూలుగా పండిన పండును మాత్రం తింటే ఎలాంటి బాధా ఉండదు. అదే ఎక్కువగా పండిన పండును మాత్రం తిన్నట్లయితే అందులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండి, చక్కెర వ్యాధి గ్రస్తులకు ఎక్కువగా హాని చేస్తుంది. అలాగే లివర్ వ్యాధితో, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు సైతం ఈ సీతాఫలానికి దూరంగా ఉండాలి. అలాగే, ఆస్తమా ఉన్నవారు కూడా ఈ సీతాఫలంను తీనకూడదని నిపుణులు చెబుతున్నారు..
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..