వయసు తక్కువ.. కానీ జుట్టు తెల్లబడుతుంది. ఇప్పుడు జనరేషన్‌లో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అప్పుడే జుట్టు తెల్లబడటం ఏంటని తెగ బాధపడిపోతున్నారు. మారుతున్న జీవన విధానాలు, ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటివి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడటానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తెల్ల జుట్టును నివారించవచ్చు. తక్కువ వయసులో అయినా సరే జుట్టు తెల్లబడటానికి కారణం వయసుతో పాటు వర్ణకారక పదార్థాన్ని సరఫరా చేసే పొర బలహీనమై చర్యాశీలత తగ్గడమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజూ తీసుకునే ఫుడ్‌లో మల్టీ విటమినులు, బి కాంప్లెక్స్ విటమినులు ఉండేట్లు చూసుకోవాలి. తెల్లబడిన తల తిరిగి నల్లబడటానికి సరైన మెడిసిన్, చికిత్సా పద్ధతులు ప్రస్తుతానికి లేనందున… మిగతా వెంట్రుకలు కూడా తెల్లబడకుండా జాగ్రత్త పడాలి. ఆహారంలో కరివేపాకు మోతాదు ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. దీని వల్ల వెంట్రుకల రంగు నల్లబడే అవకాశం ఉంది. సెలూన్లకు వెళ్ళో, స్పాలకు వెళ్లి తరచూ మర్దన చేయించడం వల్ల తల వెంట్రుకల కుదుళ్లు బలహీనం అవుతాయి. అందుకే అదే పనిగా మసాజ్‌లు మానెయ్యండి.
ఆకుకూరలు, పండ్లు, పాలు, మాంసం, గ్రుడ్లు ఎక్కువగా వాడాలి. మొలకలు, తృణ ధాన్యాలు డైలీ డైట్‌లో భాగం చేసుకోవాలి. గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని అందులో వేపాకుల్ని వేసి మరిగించి, బాగా చల్లారిన తర్వాత వడగట్టి, ఆ నీటితో తలను కడుక్కుంటే జుట్టు రాలడం, పొడిబారడం, చుండ్రు వంటి సమస్యలను పారద్రోలవచ్చు. ఇప్పుడిప్పుడే జుట్టు తెల్లబడుతుంటే.. రెండు టీ స్పూన్ల హెన్నా పౌడర్ తీసుకోండి. ఒక టీస్పూన్ పెరుగు, ఒక టీ స్పూన్ మెంతుల పొడి, మూడు టీ స్పూన్ల పొదీనా రసంను మిక్స్ చేయండి. మిశ్రమాన్నంతా పేస్ట్‌లా చేసి జుట్టుకు పట్టించండి. రెండు లేదా మూడుగంటలు తర్వాత షాంపూతో స్నానం చేయండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
Also Read: స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఆడీ ఆర్8 కార్ ఓనర్.. ప్రాంక్ కాదండోయ్