Sugar Challenge: 30 రోజులు చక్కెర తినడం మానేస్తే ఏమౌతుందో తెలుసా ? మీ బాడీలో జరిగే మార్పులివే..

ఈ రోజుల్లో ఆరోగ్య అవగాహన పెరుగుతోంది. ప్రజలు తమ ఆహారాన్ని మెరుగుపరచుకోవడానికి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. అలాంటి ఒక ప్రయత్నం 30డేస్ నో షుగర్ ఛాలెంజ్. ఈ నో షుగర్ ఛాలెంజ్‌లో భాగంగా 30 రోజుల పాటు చక్కెరను పూర్తిగా తగ్గించడం లేదా మానేయటం చేస్తారు. శరీరాన్ని చక్కెర వ్యసనం నుండి విముక్తి చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం ఈ ఛాలెంజ్ లక్ష్యం. ఈ ఛాలెంజ్‌ను ఎలా పూర్తి చేయాలో, దాని ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Sugar Challenge: 30 రోజులు చక్కెర తినడం మానేస్తే ఏమౌతుందో తెలుసా ? మీ బాడీలో జరిగే మార్పులివే..
Quit Sugar

Updated on: Nov 23, 2025 | 8:20 AM

నో షుగర్‌ ఛాలెంజ్‌ ఒక డీటాక్స్ ప్రోగ్రామ్. దీనిలో 30 రోజుల పాటు చక్కెర కలిగిన ఆహారాలు, పానీయాలకు దూరంగా ఉండాలి. ఇందులో తెల్ల చక్కెర మాత్రమే కాకుండా, చక్కెర కలిగిన ప్రాసెస్ చేసిన ఆహారాలు, శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లు, స్వీట్లను కూడా నివారించాలి. చక్కెర ప్రతికూల ప్రభావాల నుండి శరీరాన్ని రక్షించడం, ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడం ఈ ఛాలెంజ్‌ లక్ష్యం. చక్కెర లేని ఆహారాన్ని 30 రోజుల పాటు తినడం వల్ల కడుపు ఉబ్బరం తగ్గుతుంది. చక్కెర తినకపోవడం వల్ల జీర్ణాశయంలో ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

30 రోజుల పాటు చక్కెరకు దూరంగా ఉండటం వల్ల ఫుడ్‌ క్రేవింగ్స్ తగ్గుతాయి. దీని వల్ల ఫాస్ట్‌ఫుడ్‌, చిరుతిళ్లు తక్కువ తింటారు. మంచి ఫుడ్‌ తినేందుకు అవకాశం లభిస్తుంది. 30 రోజుల పాటు షుగర్‌ మానేయటం వల్ల ఫైబర్‌, ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎనర్జీ లెవెల్స్‌ పెరుగుతాయి. అలసట తగ్గుతుంది. 30 రోజుల పాటు చక్కెరకు దూరంగా ఉంటే మనం తీసుకునే కేలరీలు తగ్గుతాయి. ఫుడ్‌ క్రేవింగ్స్‌ తగ్గుతాయి. ఈ రెండిటీ వల్ల వేగంగా బరువు తగ్గుతారు. చక్కెర కలిగిన ఆహారాలకు దూరంగా ఉండటం వల్ల ఇన్సులిన్‌ సెన్సిటివిటీ పెరుగుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.

30 రోజుల పాటు షుగర్‌కు దూరంగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. అందం పెరుగుతుంది. దంతాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చిగుళ్లు బలంగా మారుతాయి. నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. ఇలా నెల రోజుల పాటు చక్కెర లేని ఫుడ్స్‌ తీసుకోవడం వల్ల బాడీలో షుగర్‌ లెవెల్స్‌ అదుపులోకి వస్తాయి. దీని వల్ల రాత్రిపూట నిద్రబాగా పడుతుంది. నిద్రలేమి సమస్యలు ఉండవు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..