Health: మూత్ర విసర్జన సమయంలో నొప్పా.? నిపుణులు ఏమంటున్నారంటే..

మూత్ర విసర్జన చేసే సమయంలో నొప్పిగా ఉండడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈ సమస్యకు ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఎందుకు ఉంటుంది.? ఏ సమయంలో అలర్ట్‌ అవ్వాలి ఇప్పుడు తెలుసుకుందాం..

Health: మూత్ర విసర్జన సమయంలో నొప్పా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Health
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 30, 2024 | 4:21 PM

మూత్రవిసర్జన సమయంలో నొప్పి రావడం సర్వసాధారణమైన విషయం. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో ఈ సమస్యతో ఇబ్బంది పడే ఉంటారు. దీనిని వైద్య పరిబాషలో డైసూరియా అంటారు. ఇంతకీ ఈ సమస్యకు అసలు కారణం ఏంటి.? ఎలాంటి నివారణ చర్యలు ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మూత్ర విసర్జన సమయంలో నొప్పి రావడానికి మూత్ర నాళంలో ఏర్పడే సమస్యలు కారణంగా చెబుతుంటారు.

ఈకోలి అనే బ్యాక్టీరియా కారణంగా మూత్రవిసర్జన చేసేటప్పుడు మంటగా ఉండడం, తరచుగా మూత్రవిసర్జన వస్తున్న భావన కలగడం, దుర్వాసనతో కూడిన మూత్రం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మూత్రవిసర్జన చివరిలో మూత్రాశయం లైనింగ్ చికాకు వల్ల కూడా నొప్పిగా ఉంటుందని అంటున్నారు. ఇక మూత్ర విసర్జన సమయంలో నొప్పిగా ఉండడానికి.. ప్రవేట్‌ పార్టులోకి రసాయనాలు చేరడం. ముఖ్యంగా స్నానం చేసే సమయంలో ఉపయోగించే సబ్బుల వల్ల ఇలాంటి ఇబ్బందులు కలుగుతాయి.

కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడం వల్ల కూడా నొప్పి వస్తుంది. ముఖ్యంగా మూత్రవిసర్జన సమయంలో మూత్రనాళం గుండా రాళ్లు వెళుతున్నప్పుడు విపరీతమైన నొప్పి ఉంటుంది. కొన్నిసార్లు మూత్రంలో రక్తం కూడా కనిపిస్తుంది. గోనేరియా లేదా క్లామిడియా వంటి శృంగార సంబంధిత సమస్యలు కూడా కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా మూత్ర విసర్జన సమయంలో నొప్పి వస్తుంది. మూత్రనాళం వాపు కారణంగా కూడా నొప్పి వస్తుందని అంటున్నారు.

మూత్రాశయ సిండ్రోమ్ కారణంగా కూడా మూత్రనాళంలో అసౌకర్యం ఏర్పడి నొప్పికి దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు. ఇక పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంధి వాపు మూత్రవిసర్జన సమయంలో లేదా తర్వాత నొప్పికి దారి తీస్తుందని అంటున్నారు. మహిళల్లో ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా బాక్టీరియల్ వాజినోసిస్ వంటి వెజినా ఇన్ఫెక్షన్ల వల్ల కూడా మూత్ర విసర్జన సమయంలో నొప్పి వస్తుంది. బలహీనమైన కండరాల వల్ల కూడా మూత్ర విసర్జన సమయంలో నొప్పి వస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..