Migraine vs Headache: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా.. ప్రతి ఒక్కరు ఎదుర్కోంటున్న సమస్య తలనొప్పి.. ఉద్యోగంలో పని భారం.. ఇంట్లో సమస్యలతోపాటు.. అనారోగ్య సమస్యల ఒత్తిడికి గురయ్యేవారి సంఖ్య రోజు రోజూకీ పెరుగిపోతుంది. అయితే చాలా మందికి ఈ సమస్య ఇప్పుడు పెనుభూతంగా మారింది. సప్లిమెంట్స్ తీసుకున్నా కొందరిలో ఈ సమస్య మాత్రం తీవ్రంగా బాధిస్తుంటుంది. ఇక చాలా మంది మహిళలలో మైగ్రేన్ సమస్య కూడా అధికంగానే ఉంటుంది. ఉద్యోగాలు చేస్తున్న వారి నుంచి.. ఇళ్లలో ఉండే మహిళల్లో ఈ మైగ్రేన్ సమస్య ఎక్కువగా వినిపిస్తుంది. అయితే సప్లిమెంట్స్ ద్వారా తలనొప్పి నుంచి తాత్కలికంగా ఉపశమనం లభించిన.. క్రమంగా ఈ సమస్య పెద్దదిగా మారిపోతుంది. అయితే ఇది సాధారణ తలనొప్పియా లేదా మైగ్రేన్ అని నిర్ధారించడం చాలా కష్టం. రెండింటి మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు సరైన చికిత్స తీసుకోవచ్చు.
తలనొప్పి అనేది నెమ్మదిగా మొదలై తీవ్రమైన నొప్పికి దారి తీస్తుంది. తల చుట్టూ వుండే కండరాలూ, రక్తనాళాలూ, నరాలూ, బ్రెయిన్ ని చుట్టుకుని వుండే “మెనింజెస్ ” పొరలూ ఇవన్నీ నొప్పిని తెలియజేసే రిసెప్టార్స్ ని కలిగి వుంటాయి. మైగ్రెయిన్ అనేది ఒక రకమైన తలనొప్పి. ఇది నరాలకు సంబంధించిన లక్షణాలతో ఉంటుంది. తలనొప్పికి ఒకటి, రెండు రోజుల ముందే మైగ్రేన్ లక్షణాలు ప్రారంభమవుతాయి. దీనిని ‘ప్రోడ్రోమ్’ దశ అని పిలుస్తారు. సాధారణంగా మైగ్రేన్ తలకు ఒక వైపు మాత్రమే ఉంటుంది. దీనితో పాటు వికారం లేదా వాంతులు, ధ్వని ఫోబియా ఉంటాయి. అయితే రోగులు తలనొప్పి, మైగ్రేన్‌ల గురించి తెలియక గందరగోళానికి గురవుతారు. ప్రత్యేకించి మైగ్రేన్‌ని కనుగొనడం కొంత ఆలస్యమవుతుంది.
తలనొప్పి తగ్గాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి. రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. దీనివలన కండరాలు రిలాక్సవుతాయి. సమతుల్య ఆహారం తీసుకోవాలి.కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వాడవచ్చు. అదీ ప్రమాదం కలిగించని పారసిటమాల్, అసిటమైనోఫెన్ లాంటి మాత్రలు డాక్టర్ సలహాపై వాడొచ్చు మైగ్రేన్ వున్న వాళ్లు, కొన్ని పదార్థాలు తీసుకోకూడదు. ఛీజ్ ,నట్స్ ,ఆల్కహాల్ ,స్మోకింగ్ వీటికి దూరంగా వుండాలి, తమకు పడని వాసనలకి కూడా దూరంగా వుండటం మంచిది. రోజుకి కనీసం ఎనిమిది గంటలు చక్కని ప్రశాంతమైన నిద్ర పోతే చాలా వ్యాధులు దూరంగా వుంటాయి. ప్రశాంతంగా చీకటి గదిలో చల్లని వాతావరణంలో సేదదీరడంతో పాటు, సుమా ట్రిప్టాన్ ,ఆమ్లో ట్రిప్టాన్ , తోపాటు ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ ని చికిత్స కోసం వాడవచ్చు.